https://oktelugu.com/

Liger First Review: లైగర్’ ఫస్ట్ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

Liger First Review: లైగర్ సినిమా కోసం చిత్రబృందం ముందు నుంచి డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. ఇంతకీ ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?, ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాను ఆల్ రెడీ చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ .. ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఇంతకీ ఈ రివ్యూలో […]

Written By:
  • Shiva
  • , Updated On : August 24, 2022 / 05:20 PM IST

    Liger First Review

    Follow us on

    Liger First Review: లైగర్ సినిమా కోసం చిత్రబృందం ముందు నుంచి డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. ఇంతకీ ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?, ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాను ఆల్ రెడీ చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ .. ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఇంతకీ ఈ రివ్యూలో ఏమి చెప్పారో తెలుసుకుందాం.

    vijay devarakonda

    కథ :

    లైగర్ (విజయ్ దేవరకొండ) తన తల్లి (రమ్యకృష్ణ) తో కలిసి బతకడానికి ముంబై వస్తాడు. అయితే, లైగర్ చిన్నప్పటి నుంచి మైక్ టైస‌న్ అభిమాని. టైస‌న్‌తో ఓ సెల్ఫీ తీయించుకోవాల‌ని `లైగ‌ర్‌` డ్రీమ్. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం లైగర్ చివ‌రికి క్లైమాక్స లో.. టైస‌న్‌ ట్రైనింగ్ లోనే పెద్ద బాక్సర్ అవుతాడు. అసలు లైగర్ త‌న క‌ల‌ని నిజం చేసుకోవడానికి చేసిన కృషి ఏమిటి ?, ఈ మధ్యలో మ‌ద‌ర్ రమ్యకృష్ణ పాత్ర ఏమిటి ?, మధ్యలో అనన్య పాందేతో ‘లైగర్’ లవ్ ట్రాక్ ఏమిటీ ? అనేది మిగిలిన కథ.

    Also Read: Hero Nikhil: ఎందరో స్టార్ హీరోల వల్ల కాలేదు… కానీ నిఖిల్ చేసి చూపించాడు

    విశ్లేషణ :

    లైగర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మాస్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సినిమా. ముందుగా సినిమాలో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్, హీరో విజయ్ దేవరకొండ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రల ఎమోషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అలాగే, సెకండాఫ్ లో వచ్చే బాక్సింగ్ సీన్స్ అండ్ అనన్య తో సాగే రొమాంటిక్ సీన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్. పైగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది.

    నటి నటీనటుల నటన విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే చాలా బోల్డ్ అండ్ వైల్డ్ గా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా విజయ్ – పూరి కాంబినేషన్‌ అదిరింది. పూరి మార్క్, విజయ్ ఇమేజ్ బాగా సింక్ అయ్యాయి. విజయ్ – రమ్యకృష్ణ ట్రాక్ అయితే, ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్. మదర్ సెంటమెంట్ ను ఇలా కూడా చూపించిచ్చా అని పూరి ఆశ్చర్యపరిచాడు. పైగా పవర్ ఫుల్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ విజిల్స్ వేయించింది.

    vijay devarakonda

    సినిమా కథాకథనాల విషయానికి వస్తే.. మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఫుల్ గా ఉన్నాయి. అలాగే, ఈ చిత్రం లవర్స్ కి కూడా ఫుల్ మీల్ లాంటి సినిమా అవుతుంది. కానీ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడటానికి కాస్త ఇబ్బంది పడాలి. కొన్ని డైలాగ్స్ లో బూతు మాటలు చాలా సహజంగా వచ్చేశాయి. అలాగే, కొన్ని సీన్స్ లో అస్సలు లాజిక్ ఉండదు. పైగా ఈ సీన్స్ బోర్ గా సాగాయి. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే నే అంచనాలకు తగ్గట్టుగా లేదు.

    తీర్పు :

    లైగర్ ఒక యాక్షన్ అండ్ ఎమోషనల్ బోల్డ్ డ్రామా. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో భారీ యాక్షన్ కూడా ఉంది. అన్నిటికీ మించి భారీ తారాగణం, యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ క్లాస్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు.

    Also Read:Shraddha Das: బాబోయ్.. చీరలో కూడా ఈ ఎక్స్ పోజింగ్ ఏమిటి.. మరీ ఇంత దారుణమా ?.. పిచ్చెక్కించిన బన్నీ హీరోయిన్ !



    Tags