Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో భారీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఛార్మితో కలిసి పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. కాగా ఇప్పుడు తాజాగా లేటెస్ట్‌గా లైగర్ సినిమా నుంచి డబుల్ ధమాకా ఇచ్చాడు విజయ్ దేవరకొండ. మూవీకి సంబంధించి రెండు అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్.
Liger Movie
Also Read: ఫస్ట్ టైమ్ ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆ పని చేస్తున్న తారక్… ఏంటి అంటే
‘లైగర్’ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అలానే కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న ‘లైగర్’ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్లు మరో గిఫ్ట్ ను అందించారు. ఈ సినిమాను తెలుగు, హిందీల్లో రూపొందించినప్పటికీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. అంటే లైగర్ పాన్ ఇండియా రేంజ్ మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. తమ అభిమాన రౌడీ హీరోను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. విజయ్ దేవరకొండను సరికొత్త లుక్, క్యారెక్టరైజేషన్‌తో పాటు ప ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Unleashing the beast to nation on 𝟐𝟓th 𝐀𝐮𝐠 𝟐𝟎𝟐𝟐🥊 #LigerOnAug25th2022
And catch the glimpse of our madness on this 𝟑𝟏st 𝐃𝐞𝐜🔥#Liger@TheDeverakonda @MikeTyson #PuriJagannadh @ananyapandayy @karanjohar @apoorvamehta18 @IamVishuReddy @DharmaMovies @PuriConnects pic.twitter.com/vS3g4PoxmV
— Charmme Kaur (@Charmmeofficial) December 16, 2021
Also Read: నెటిజన్ కామెంట్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Vijay devarakonda gives double treat from liger movie to his fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com