Vijay Devarakonda: కొండన్న నువ్వు రష్మికను వదిలేయ్ ముందు.. వీడియో వైరల్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా శుక్రవారం విడుదలైంది.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయకగా నటించింది. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 5, 2024 7:17 pm

Vijay Devarakonda Fan Viral Video

Follow us on

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక వ్యవహారం సోషల్ మీడియాలో, మీడియాలో నానుతూనే ఉంటుంది. వారిద్దరి వ్యవహారం గురించి మీడియా రోజుకో రకమైన కథనాన్ని వండి వారస్తూనే ఉంటుంది. దానిని అటు విజయ్, ఇటు రష్మిక ఖండించారు. తప్పు కూడా పట్టరు.. కానీ వారిద్దరూ విదేశాల్లో విహరిస్తూనే ఉంటారు. దానికి సంబంధించిన ఫోటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాయి, చేస్తూనే ఉన్నాయి కూడా.. ఆమధ్య విజయ్ మాల్దీవులకు వెళ్ళాడు. ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొంత సమయానికే రష్మిక ఒక ఫోటో అప్లోడ్ చేసింది. అటు విజయ్, ఇటు రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలు దాదాపు సేమ్ లొకేషన్ లాగానే కనిపించాయి. అప్పట్లో ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ ఫోటోల ద్వారా వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే అంచనాకు నెటిజెన్లు వచ్చారు.

ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా శుక్రవారం విడుదలైంది.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయకగా నటించింది. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా కు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన ఓ అభిమాని తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్, రష్మిక మధ్య ప్రేమాయణం సాగుతున్న నేపథ్యంలో.. ఓ అభిమాని మండిపడ్డాడు. “కొండన్న.. ఈ సినిమా బాగాలేదు. నువ్వు ముందు రష్మికను వదిలేయ్.. నీ కెరియర్ మీద దృష్టి పెట్టు. అప్పుడే బాగుపడతావు అంటూ” చురకలంటించాడు.”ఫ్యామిలీ స్టార్ సినిమా బాగోలేదు. కథ, కథనం, మాటలు, సంగీతం, దర్శకత్వం వంటివి బాగోలేవు. సినిమా అంత ఆసక్తికరంగా లేదు” అంటూ ఆ అభిమాని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.. మరి దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దిల్ రాజు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కావడంతో భారీగానే సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు కూడా భారీగానే చేపట్టారు. అయితే సినిమాకు సంబంధించి మిశ్రమ స్పందన రావడంతో విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా కథ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేదని.. కథనం కూడా మెప్పించలేకపోయిందని వారు వాపోతున్నారు.