Rowdy Boys Movie: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు నిర్మాత కావడంతో కొడుకు వరస అయ్యే ఆశిష్ కి గ్రాండ్ లాంచ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా పెద్ద మొత్తంలో చేస్తున్నారు. టీజర్, టైటిల్ సాంగ్‌ను విడుదల చేసి ఈ సినిమాపై ప్రేక్షక అభిమానుల్లో ఆసక్తి పెంచారు. ఇప్పుడు మరో పాటను రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా లోని సెకండ్ సాంగ్ ను ” విజయ్ దేవరకొండ ” తో లాంచ్ చేయించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ నెల 20 వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తులో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి… దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గతం లో ఆయన డైరెక్ట్ చేసిన ‘హుషారు’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి స్పెషల్ అట్రాక్షన్ గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలేజ్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Vijay devarakonda as cheif guest for rowdy boys song launch event
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com