Vijay Devarakonda- Sandeep Reddy Vanga: విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ ప్రేక్షకులకు అభిమాన దర్శకుడు అయిపోయాడు సందీప్ రెడ్డి వంగ. కానీ ఆ తర్వాత మాత్రం ఈ దర్శకుడు ఇంకా ఏ తెలుగు సినిమా తీయలేదు. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ త్వరలోనే అల్లు అర్జున్, ప్రభాస్ తో సినిమా తీయనున్నారు అన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరితోనే కాకుండా మరో సెన్సేషన్ హీరోతో కూడా ఈ దర్శకుడు ఒక ప్రాజెక్టు ఫిక్స్ అయ్యారట.
సినీ వర్గాల సమాచారం ప్రకారం అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ మరోసారి వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి. అంతే కాదు ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ చెప్పడం విశేషం. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఖుషి మూవీ వరల్డ్ వైడ్‌గా ఈ శుక్రవారం, సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా అర్జున్ రెడ్డి కాంబోపై మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డియర్ కామ్రేడ్, ఖుషి తర్వాత విజయ్ దేవరకొండతో మూడో మూవీ చేయాలంటే ఎలాంటి సినిమా చేస్తారని ప్రమోషన్స్‌లో అడిగిన ప్రశ్నకు రవిశంకర్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కాంబోలో ఓ మూవీ ఫిక్స్ చేసేందుకు సిన్సియర్ గా ట్రై చేస్తున్నామని రవిశంకర్ అన్నాడు.
ఇక దీంతో ఈ సినిమా ఉండటం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమాలోరెబెల్ ఆటిట్యూడ్ ఉన్న లవర్ బాయ్ పాత్రలో విజయ్ యాక్టింగ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో సందీప్ వంగా పేరు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో మారుమోగింది. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు సందీప్ వంగా. ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ఎనిమల్ సినిమాలో బిజీగా ఉన్నారు ఈ డైరెక్టర్.
మరోపక్క విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తరువాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తో అలానే గీతగోవిందం డైరెక్టర్ పరుశురామ్ తో సినిమాలు చేరనున్నారు. మరి ఈ డైరెక్టర్, హీరో ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్ని అయిన తర్వాతే ఈ మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ తెరపైకి రావచ్చేమో..