https://oktelugu.com/

Beast Twitter Review: విజయ్ ‘బీస్ట్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?

Beast Twitter review: తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా వస్తుందంటే అక్కడి అభిమానులకు పండుగే.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ ఈరోజు విడుదలైంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన మూవీ ఇప్పటికే అమెరికా, ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ ఈ మూవీని తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళం, హిందీల్లో ఇలా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యింది. తమిళంతోపాటు తెలుగు ఇతర భాషల్లోనూ విజయ్ మార్కెట్ ఉండడంతో దీన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : April 13, 2022 / 08:46 AM IST
    Follow us on

    Beast Twitter review: తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా వస్తుందంటే అక్కడి అభిమానులకు పండుగే.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ ఈరోజు విడుదలైంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన మూవీ ఇప్పటికే అమెరికా, ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ ఈ మూవీని తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళం, హిందీల్లో ఇలా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యింది. తమిళంతోపాటు తెలుగు ఇతర భాషల్లోనూ విజయ్ మార్కెట్ ఉండడంతో దీన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

    Beast Twitter review

    గత ఏడాది ‘మాస్టర్’ మూవీతో తెలుగులోనూ హిట్ అందుకున్న విజయ్. ఇక తాజాగా ‘బీస్ట్’తో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ సినిమా రూపొందించినట్టు తెలిసింది. ‘స్పై’గా.. రా ఏజెంట్ వీర రాఘవగా ‘బీస్ట్’ సినిమాలో విజయ్ ఇరగదీశాడని అంటున్నారు.

    Also Read: Katrina Kaif: తల్లిని చేశారు సరే.. మరి సినిమాల మాటేమిటి ?

    ఈరోజు విడుదలైన ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇఫ్పటికే ట్విట్టర్ లో ప్రేక్షకులు చెబుతున్నారు. ఆ రివ్యూలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

    సినిమా సింప్లీ ఎంటర్ టైనర్ అని.. ఇక యాక్షన్ పార్ట్ ఫ్యాన్స్ సహా అందరినీ మెప్పించేలా ఉన్నాయని కొందరు ట్వీట్ చేశారు.

    ఫస్టాఫ్ ఫన్ పాప్ కార్న్ లా మూవీ సరదాగా సాగిపోయిందని.. విజయ్ తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించాడని కొందరు ట్వీట్ చేశారు. సంచలనం సృష్టించిన ‘అరబిక్ కుత్తు’ సాంగ్ సమయంలో ఆడియెన్స్ కు థియేటర్ లో పూనకాలు వచ్చినట్టుగా ప్రేక్షకులు ట్వీట్ చేశారు.

    వీర రాఘవన్ పాత్రలో విజయ్ అద్భుతంగా నటించాడని.. పూజా హెగ్డే అందాలు మెప్పించిందంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కొందరు అభిప్రాయపడ్డారు.

     

    Also Read: Ram Charan: చరణ్.. ఈ రోజు ఫైటింగ్, రేపటి నుంచి రొమాన్స్

    Tags