Vijay Antony Daughter: తమిళ నటుడు విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 మంగళవారం ఆయన కుమార్తె మీరా ఆంటోని ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. స్థానిక చర్చ్ పార్క్ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న మీరా మానసిక ఒత్తిడికి గురయ్యాన్నారని తెలుస్తుంది. పోలీసులు ఆమె రాసిన సూసైడ్ నోట్ సైతం స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె ఎలాంటి వివరాలు, కారణాలు రాయలేదు.
కేవలం ”ఐ లవ్ యూ ఆల్, మిస్ యు ఆల్” అని రాసినట్లు సమాచారం. 16 ఏళ్ల మీరా మరణం విజయ్ ఆంటోని కుటుంబాన్ని కృంగదీసింది. కూతురు మరణం అనంతరం తొలిసారి విజయ్ ఆంటోని స్పందించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ విడుదల చేశారు.
నా కూతురు ఎంతో దయా హృదయం కలది. అంతకు మించి ధైర్యవంతురాలు. కులం, మతం, పేదరికం, డబ్బు, అసూయ, బాధ, చెడు, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన లోకానికి ఆమె వెళ్ళింది. అయినప్పటికీ ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది. ఆమె చనిపోయినప్పుడే నేను కూడా మరణించాను. ఇకపై నేను చేసే ప్రతి మంచి పని ఆమె పేరుతో ప్రారంభిస్తాను… అంటూ తమిళంలో రాసిన లేఖను విజయ్ ఆంటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
విజయ్ ఆంటోని కూతురు మరణంతో పడుతున్న వేదన ఆ లేఖలో కనిపించింది. అభిమానులు ఆయన్ని కామెంట్స్ రూపంలో ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యంగా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో విజయ్ ఆంటోని యువకుల ఆత్మహత్యల గురించి మాట్లాడాడు. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా స్వేచ్ఛా వాతావరణంలో పెంచాలి. అప్పుడు ఈ ఆత్మహత్యలు నియంత్రించగలం అన్నారు.
— vijayantony (@vijayantony) September 21, 2023