Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజినీ తర్వాత తమిళనాడు లో అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో అంటే విజయ్ పేరే చెప్పాలి. తమిళ్ తో పాటు తెలుగు లో కూడా తుపాకి, అదిరింది, మాస్టర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించు కున్నాడు. తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ ఇప్పటివరకు తన చిత్రాలన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు. అయితే నేరుగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యే విధంగా త్వరలో ఒక చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించడం విశేషం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం.
Also Read: పెళ్లివైపు గాలి మళ్లిందంటున్న అడవి శేష్.. వచ్చే ఏడాదిలోనే వివాహం?
ఈ చిత్రంలో విజయ్ తో అనుకున్న అప్పటి నుండి విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై చిత్ర బృందం తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది. దీనిపై మేకర్స్ స్పందిస్తూ… మా సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించడం లేదని తేల్చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చిత్రబృందం తెలిపారు. దాంతో ఇన్నాళ్ళు వచ్చింది కేవలం రూమర్స్ అని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు అయితే ఈ సినిమాలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవల విజయ్(Thalapathy Vijay) నటించిన “మాస్టర్” చిత్రం విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది.
Also Read: ఐటెం సాంగ్‌ను భక్తిపాటలతో పోల్చిన డీఎస్పీ.. తెలంగాణ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్