Nayanathara: తన కెరీర్లో టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని.. అందం అభినయంతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు విషెష్ తెలియజేశారు. కాగా, నయన్ ప్రియుడు కాబోయే భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్.. నయనతార పుట్టిన రోజను ఘనంగా జరిపారు. స్పెషల్ పార్టీతో నయన్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు.

అర్ధరాత్రి నుంచే చెన్నైలో నయనతారకు పుట్టినరోజు సంబరాలు మొదలయ్యయి. సరిగ్గా 12 గంటలు కాగానే.. విక్కీ నయన్‌తో కేక్ కట్చేయించి.. బాణాసంచ పేల్చి సందడి చేశారు. ఈ పార్టీకి విక్కీ, నయన్‌తో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. మరోవైపు తమ అభిమాన హీరోయిన్‌కు ఫ్యాన్స్‌తో పాటు, పలువురు ప్రముఖులు కూడా నయనతారకు బర్త్‌డే విషెస్ అందిస్తున్నారు.
Birthday Bash 🌟🎉 #VikkyNayan pic.twitter.com/UtTqX6bJtx
— Nayanthara✨ (@NayantharaU) November 17, 2021
నయనతార గత ఆరేళ్లుగా విఘ్నేశ్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఇంకా వీరి పెళ్లి ఎప్పుడన్నది ప్రకటించలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. కాగా, ప్రస్తుతం చిరు నటిస్తున్న గాడ్‌ఫాదర్ సినిమాలో నయనతారను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి నయన్ ఇందులో సత్యదేవ్‌కు భార్యగా నటించనున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై స్పష్టత రాావాలంటే.. అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఎదురు చూడాల్సిందే.