https://oktelugu.com/

F3: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఎఫ్​3.. క్లారిటీ ఇచ్చిన వెంకి

F3:  విక్టరీ వెంకటేశ్​ హీరోగా జీతూ జోషెప్​ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దృశ్యం 2.  మరికొద్ది రోజుల్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్​ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్​లో వేగం పెంచారు. మలయాళంలో సూపర్​ హీట్​గా నిలిచిన దృశ్యం 2కు రీమేక్​గా ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా అమెజాన్ ప్రైమ్​లో ఈ నెల 25న విడుదల కానుంది. దీంతో నెటిజన్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   కాగా, ఈ సినిమా  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 20, 2021 / 01:14 PM IST
    Follow us on

    F3:  విక్టరీ వెంకటేశ్​ హీరోగా జీతూ జోషెప్​ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దృశ్యం 2.  మరికొద్ది రోజుల్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్​ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్​లో వేగం పెంచారు. మలయాళంలో సూపర్​ హీట్​గా నిలిచిన దృశ్యం 2కు రీమేక్​గా ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా అమెజాన్ ప్రైమ్​లో ఈ నెల 25న విడుదల కానుంది. దీంతో నెటిజన్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

     

    కాగా, ఈ సినిమా  తర్వాత వెంకటేశ్​ ఎఫ్​3తో రానున్నారు. ఫుల్​ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే, అదే సమయంలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ వంటి భారీ చిత్రాలు రేసు ఉండటంతో ఈ పోటీలో ఎఫ్​3 తట్టుకుని నిలబడగలదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, దృశ్యం 2 ప్రమోషన్స్​లో భాగంగా ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వెంకటేశ్​ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

    ఎఫ్​3 సంక్రాంతికి విడుదల కావడం లేదని స్పష్టం చేశారు. వేసవికాలంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది తెలిపారు. ఇప్పటి వరకు సినిమా 70 శాతం షూటింగ్​ మాత్రమే పూర్తి చేసుకుందని అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు, దిల్ రాజు నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్​గా పని చేస్తున్నారు.