Victory Venkatesh Son: మన టాలీవుడ్ లో ఎంతో మంది బాలనటులు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్స్ నేడు సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మహేష్ బాబు, తరుణ్ ,జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటూ పోతే విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన ఎంతో మంది నేటి తరం స్టార్ హీరోస్ బాలనటులుగా రాణించినోళ్లే..వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక్కప్పటి బాలనటుడు త్వరలోనే హీరో గా వెండితెర కి పరిచయం కాబోతున్నారు..అతని పేరు ఆనంద్ వర్ధన్..అప్పట్లో విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన సూర్య వంశం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే ఒక్క మైలు రాయిగా నిలిచిపోయింది..తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేసిన వెంకటేష్ నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాలో చిన్న వెంకటేష్ కొడుకుగా చేసిన ఆనంద్ వర్ధన్ నటనని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..ఈ పాత్ర అప్పట్లో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంది..ఈ సినిమా లో వచ్చిన మంచి పేరు తో ఈ అబ్బాయికి బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి..ఎవరు ఈ అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అని ప్రేక్షకులు అనుకునేలా తన నటనతో ఆకట్టుకున్నాడు ఆనంద్ వర్ధన్.
Also Read: Shruti Haasan: శృతి హాసన్ కూడా జాయిన్ అయ్యిందోచ్
త్వరలోనే హీరో గా వెండితెర మీద అరంగేట్రం చెయ్యబోతున్న ఆనంద్ వర్ధన్ ఇటీవల వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు..ఈ ఇంటర్వూస్ లో ఆయన తన జీవితం లో ఎదురుకున్న సవాళ్ళను గుర్తు చేసుకున్నాడు..తన చిన్నతనం లో జరిగిన ఒక్క విషాద సంఘటన గురించి మాట్లాడుతూ ‘ నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టు గా వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించాను..నా నటన ఎంతో మంది దర్శక నిర్మాతలకు నచ్చడం తో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా బిజీ అయిపోతున్న సమయం లో ఒక్క షూటింగ్ లో నాకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది..
ఆ ఫైర్ యాక్సిడెంట్ లో నాకు చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి..డాక్టర్లు నన్ను సుమారు రెండు నెలల పాటు ICU లో పెట్టి చికిత్స చేసారు..ఈ సంఘటన జరిగిన తర్వాత నేను సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాను..కానీ ఒక్క పెద్ద సూపర్ స్టార్ గా ఎదగాలి అనేది నా కోరిక..కచ్చితంగా నేను పెట్టుకున్న లక్ష్యానికి చేరుకొని తీరుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ వర్ధన్..ఆనంద్ వర్ధన్ లాగానే చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టు గా బాగా బిజీ అయినా తేజ సజ్జల కూడా నేడు హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి రెండు హిట్స్ కూడా కొట్టేసాడు..హీరో గా ప్రస్తుతం తేజ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో నటిస్తున్నాడు..ఆనంద్ వర్ధన్ కూడా అదే స్థాయిలో రాణిస్తాడా లేదా అనేది చూడాలి..ఇంటర్వూస్ లో అతనిలో ఉన్న కసి ని చూస్తూ ఉంటె కచ్చితంగా ఇండస్ట్రీ లో నాటుకు పోవాలి అనే తాపత్రయం కనిపిస్తుంది..మంచి స్క్రిప్ట్స్ ని ఎంచుకొని ముందుకు పోతే ఆయన కూడా మంచి క్రేజీ స్టార్ హీరో గా మారొచ్చు అనడం లో ఎలాంటి సందేహం లేదు..బాలనటుడిగా ఎంతో గొప్పగా రాణించిన ఆనంద్ వర్ధన్, హీరో గా కూడా అదే స్థాయిలో రాణిస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read: Byreddy Siddharth Reddy: వైసీపీకి బైరెడ్డి బైబై.. టీడీపీ గూటికి ఫైర్ బ్రాండ్ సిద్ధార్థ్ రెడ్డి
[…] Also Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటె… […]
[…] Also Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటె… […]
[…] Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటె… Recommended […]
[…] Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటె… Recommended […]