https://oktelugu.com/

F3 Movie: ఎఫ్ 3 బృందానికి పార్టీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్… ఏం పార్టీ అంటే

F3 Movie: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​, వరుణ్​ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. అయితే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 7, 2021 / 09:49 PM IST
    Follow us on

    F3 Movie: అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్​, వరుణ్​ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్​లో వచ్చిన ఎఫ్​2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై దిల్​రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. అయితే తాజాగా షూటింగ్ గ్యాప్ లో వెంకటేష్ తోటి నటీనటులకు టీ  పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

    ఈ మేరకు ఈ టీ బ్రేక్ గురించి వరుణ్ తేజ్ పోస్ట్ చేస్తూ… వెంకీ బ్రో ఇంట్లో టీ టైమ్, లవ్లీ హోస్ట్‌ గా ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ ఒక  ఫోటోను అబిమానులతో పంచుకున్నాడు. అలానే అనిల్ రావిపూడి కూడా ఈ టీ పార్టీ గురించి పోస్ట్ చేస్తూ షూట్ గ్యాప్ లో కొన్ని సరదా సంభాషణలతో మా వెంకీ గారి ఇంటి దగ్గర చిల్లింగ్ టీ బ్రేక్ అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటోలో వెంకీతో పాటు వరుణ్, తమన్నా, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సునీల్  ఉన్నారు.

    ఇటీవల దీపావళి కానుకగా ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ హైదరాబాద్​లోని దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జ్​ వద్ద సునీల్​, వెంకటేశ్​, వరుణ్​తేజ్, అనిల్​ రావిపుడి కలిసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ టీ పార్టీ ఫోటోలు వైరల్ గా మారాయి.