Vicky Kaushal-Katrina Kaif: బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ కత్రినా కైఫ్‌ను తన లైఫ్ పార్ట్‌నర్ చేసుకోబోతున్నాడు. కొద్ది రోజుల నుంచి ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న వీరిరువురు ఒక్కటి కాబోతున్నారు. ఇక వారి పెళ్లి చారిత్రత్మక ప్రదేశంలో జరుగుతుండటం విశేషం. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడుంది.. దాని విశేషాలు ఏంటంటే..

రాజస్థాన్ స్టేట్‌లోని సిక్స్ సెన్సెస్ బార్వారా ఫోర్ట్ హోటల్‌లో విక్కీ-కత్రినల మ్యారేజ్ జరగనుంది. ఈ కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అతి తక్కువ మంది అతిథులు హాజరుకానున్నారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇప్పటికే ఆ ప్లేస్‌కు చేరుకున్నారు. మ్యారేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చినప్పటికీ అఫీషియల్‌గా అయితే విక్కీ కౌశల్ కాని కత్రినా కైఫ్ కాని అనౌన్స్ చేయలేదు. వివాహ వేడుక కూడా గోప్యంగా జరగనుంది.
సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో ఈ నెల 9న మ్యారేజ్ జరగనుంది. అయితే, డిసెంబర్ 7 నుంచి 10 వరకు ఇక్కడ సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మ్యారేజ్ తర్వాత రాజా మాన్‌సింగ్ సూట్‌లో విక్కీ కౌశల్ బస చేయనున్నారు. కత్రినా కైఫ్ ప్రిన్సెస్ సూట్‌లో ఉండబోతుంది. మ్యారేజ్ పూర్తిగా ఓల్డ్ ట్రెడీషన్స్ ప్రకారం అనగా యువరాజుల పెళ్లి మాదిరిగా ఉండబోతున్నది. అలనాటి రాజుల పెళ్లి మాదిరిగానే ఈ పెళ్లి వేడుక ఉండబోతున్నది. 700 ఏళ్ల కిందటి ఈ చారిత్రక కోటలో మ్యారేజ్ జరగనుంది. అయితే, ఈ హోటల్ వద్ద ఇప్పటికే టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. విలాసవంతమైన ఈ కోటలో ఎన్నో వసతులు ఉన్నాయి. కోటను అంగరంగ వైభవంగా అలంకరించారు.
Also Read: కత్రినా-విక్కీ పెళ్లి సందడి.. ప్రత్యేకతలివే?
ఇక ఈ రాయల్ వెడ్డింగ్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారయింది. దాని ప్రకారం డిసెంబర్ 8న అనగా బుధవారం.. నైట్ సంగీత్ వేడుక ఉంటుంది. అనంతరం వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. మ్యారేజ్ తర్వాత రాత్రి భోజనం, తర్వాత పార్టీ కూడా ఉంటుంది. సంగీత్ ఈవినింగ్ టైంలో ఫినిష్ కాగా, అర్ధరాత్రి వరకు రాజుల కాలం నాటి పద్ధతిలో మ్యారేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే కోట చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మ్యారేజ్ కోసం ఈకోటలో ఒక్క రోజుకు రెంట్ రూ.65 వేల నుంచి రూ.4 లక్షల 70 వేల వరకు ఉంటుదని తెలుస్తోంది. రాజా మాన్ సింగ్ సూట్ కోసం అత్యధిక చార్జీలు ఉంటాయని తెలుస్తోంది. అయితే, వేడుకను సురక్షితంగా నిర్వహించుకునేందుకు ప్రైవేటు బౌన్సర్లనూ ఏర్పాటు చేయడంతో పాటు పోలీసుల సాయం తీసుకోనున్నారు.
Also Read: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ – కత్రీన పెళ్లికి సర్వం సిద్ధం