Venu Swamy On Pallavi Prashanth: బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సీజన్ 7 మంచి రేటింగ్ తో దూసుకొని పోయింది. ఇక ఇందులో ఉల్టాపల్టా అంటూ తెగ సందడి చేశారు నాగార్జున. అయితే రైతు బిడ్డగా వచ్చినా పల్లవి ప్రశాంత్ ప్రజాధారణ పొందారు. రైతు బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందారు ఈయన. తన ఆటతీరుతో ప్రేక్షకులను కూడా మెప్పించి చివరకు విజేతగా నిలిచారు. ఇక వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన జ్యోతిష్యం చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఫినాలేలో కప్ సాధించిన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ఆ రోజు కంటెస్టెంట్ల అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్థ స్టూడియో వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ర్యాలీలు చేయకూడదని వారించారు. ఈ విధంగా పోలీసులు చెప్పిన మాట ప్రతి ఒక్కరు విన్నా.. ప్రశాంత్ మాత్రం కాస్త పట్టించుకోకుండా ర్యాలీ తీశారు అని టాక్. అంతే కాదు ఈయన అభిమానులు కూడా ఎవరి మాట వినకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత రెండు రోజులకు కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఈయన గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. డీసీపీ జోయల్ డేవిస్ పద్దతిగా ర్యాలీ చేయవద్దని పల్లవి ప్రశాంత్ కు చెబితే.. ర్యాలీ చేశాడు. దీంతో హీరో అవ్వాల్సిన ప్రశాంత్ కాస్త జీరో అయ్యాడు. ఫేమ్ మొత్తం పోయింది. అయినా ఫేమస్ అవడం చాలా కష్టం. దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం అంటూ తెలిపారు. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం సులభమే. కానీ కాపాడడం, మంచి జీవితం మాత్రం కష్టం అని కామెంట్లు చేశాడు. ఇలా ప్రశాంత్ ను ఉద్దేశించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.