https://oktelugu.com/

Venu Swamy : నన్ను వేధించారు.. టాలీవుడ్ కు శాపం పెట్టాను.. టాలీవుడ్ పతనం మొదలైందంటూ వేణు స్వామి సంచలన కామెంట్స్

టాలీవుడ్ ని వేణు స్వామి వదిలేలా లేడు. పరిశ్రమలో జరుగుతున్న వరుస వివాదాలకు తానే కారణం అంటున్నాడు. తనను పరిశ్రమ ఇబ్బంది పెట్టింది. అందుకే ఈ విధంగా మూల్యం చెల్లిస్తుంది.. అంటూ తాజా ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : December 19, 2024 / 02:11 PM IST

    Venu swamy Comments On Tollywood

    Follow us on

    Venu Swamy : వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. జాతకాల పేరిట ప్రముఖులపై వేణు స్వామి చేసే కామెంట్స్ వివాదస్పదం అవుతూ ఉంటాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సెలెబ్స్ పై వేణు స్వామి అనుచిత కామెంట్స్ చేశాడు. వారి అభిమానులను ఇబ్బంది పెట్టాడు. గతంలో సమంత-నాగ చైతన్యల వైవాహిక బంధాన్ని ఉద్దేశిస్తూ వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. విడిపోతారని అన్నాడు. నిజంగా వారిద్దరూ విడాకులు తీసుకోవడంతో..నేను చెప్పింది జరిగింది అంటూ, అభిమానుల మనోభావాలు దెబ్బతీశాడు.

    ఇక ఆగస్టు 8న నాగ చైతన్య మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. శోభిత ధూళిపాళ్లతో రెండేళ్లకు పైగా డేటింగ్ చేసిన నాగ చైతన్య ఇటీవల వివాహం కూడా చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ ప్రకటన వచ్చిన వెంటనే వేణు స్వామి రంగంలోకి దిగాడు. శోభిత-నాగ చైతన్యల బంధం కూడా చిరకాలం సాగదు. ఒక మహిళ కారణంగా విడిపోతారు. అసలు నాగ చైతన్యకు తండ్రి అయ్యే యోగం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    వేణు స్వామి పై నాగార్జున ఫైర్ అయినట్లు సమాచారం. వేణు స్వామి మీద కేసు పెట్టడంతో లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేశాడు. టీవీ 5 మూర్తి తో కూడా వేణు స్వామికి వివాదం నడిచింది. టీవీ 5 మూర్తి డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. వాళ్ళ నుండి మాకు ప్రాణహాని ఉందని వేణు స్వామి దంపతులు ఆరోపణలు చేశారు. ఈ కేసు కూడా కోర్ట్ లో నడుస్తుంది. కాగా ఇటీవల పరిశ్రమలో వరుస వివాదాలు నెలకొన్నాయి.

    కొడుకు మనోజ్ తో మోహన్ బాబుకు గొడవలు జరిగాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. ఈ విపరీతాలకు కారణం తానే అంటున్నాడు వేణు స్వామి. తనను టాలీవుడ్ ఇబ్బందులకు గురి చేసింది. దాని పర్యవసానాలే ఇవి. నేను ఆగస్టులోనే టాలీవుడ్ గింగిరాలు తిరుగుతుందని చెప్పాను. భవిష్యత్ లో ఇంకా విపరీత సంఘటనలు చోటు చేసుకుంటాయని భయపెట్టే ప్రయత్నం చేశాడు. వేణు స్వామి వీడియో వైరల్ అవుతుంది.

    కాగా వేణు స్వామి జాతకాలను నమ్మే చిత్ర ప్రముఖులు ఉన్నారు. ఆయనతో పూజలు జరిపించడం ద్వారా జీవితంలో శుభాలు జరుగుతాయని నమ్ముతారు. టాప్ హీరోయిన్ రష్మిక మందాన వేణు స్వామి భక్తురాలు అని చెప్పొచ్చు. డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ సైతం వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించారు.