Venu Swamy: ఆ స్టార్ హీరోలిద్దరూ సినిమాలకు దూరం అవుతారట

Venu Swamy:  వేణు స్వామి అనే జ్యోతిషుడు గురించి, అతను తాజాగా ఎన్టీఆర్ గురించి చెప్పిన జోస్యం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వేణు స్వామి గత ఆరేడేళ్లుగా సోషల్ మీడియాలో ప్రముఖల జాతకాలు చెప్తూ హడావిడి చేస్తున్నారు. బాలీవుడ్ లో కేఆర్కే వంటి కొందరు క్రిటిక్స్ తాము చెప్పిందే నిజమైంది అని సినిమా ఫలితాలను, తమ రేటింగ్స్ తో పోల్చి డబ్బాలు కొట్టుకున్నట్లు.. ఈ వేణు స్వామి కూడా ఇలాంటి […]

Written By: Shiva, Updated On : April 5, 2022 5:58 pm
Follow us on

Venu Swamy:  వేణు స్వామి అనే జ్యోతిషుడు గురించి, అతను తాజాగా ఎన్టీఆర్ గురించి చెప్పిన జోస్యం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వేణు స్వామి గత ఆరేడేళ్లుగా సోషల్ మీడియాలో ప్రముఖల జాతకాలు చెప్తూ హడావిడి చేస్తున్నారు. బాలీవుడ్ లో కేఆర్కే వంటి కొందరు క్రిటిక్స్ తాము చెప్పిందే నిజమైంది అని సినిమా ఫలితాలను, తమ రేటింగ్స్ తో పోల్చి డబ్బాలు కొట్టుకున్నట్లు.. ఈ వేణు స్వామి కూడా ఇలాంటి హంగామా చేస్తూ తాజాగా ఎన్టీఆర్ భవిష్యత్తు గురించి చెప్పుకొచ్చాడు.

Venu Swamy, NTR

చెప్పాడు అనగానే ఏదో ఉహించుకోవద్దు. ఈయన జోస్యం ఎలా ఉంటుందో ఒక్క మాటతో క్లారిటీ తీసుకుందాం. కేసీఆర్, చంద్రబాబు అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తారని 2017లో సొల్లు జోస్యం చెప్పిన మహానుభావుడు ఇతగాడే. సరే.. ఈయన గారి గురించి మరో ఉదాహరణ కూడా చెప్పుకుందాం. రెండు నెలల్లో కవిత మంత్రి పదవి చేపడుతారని నాలుగేళ్ళ క్రితం చెప్పాడు.

Also Read: SS Rajamouli: రాజ‌మౌళి రేంజ్ కి ఆ డైరెక్ట‌ర్ రాగ‌ల‌డా.. ఆ మూవీ రిలీజ్ అయితేగానీ చెప్పలేం..

అంత గొప్ప ఆస్ట్రాలజర్ ఈయన. కానీ.. సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పాడు. అది నిజం కావడం, ఈయన జోస్యాలకు సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది. లేటెస్ట్ గా ఈయన గారు చెప్పిన కొన్ని సొల్లు కబర్లు చూద్దాం.

ఈ ఏడాది ఇద్దరు తెలుగు స్టార్ హీరోలకు ఆరోగ్య సమస్యలు వస్తాయట. దాంతో సినిమాలకు వాళ్ళు దూరం అవుతారట. ఇంతకీ ఆ హీరోలు ఎవరు ? అది మాత్రం చెప్పలేదు. చెబితే.. ఆ హీరో ఫ్యాన్స్ వచ్చి పిచ్చ కొట్టుడు కొడతారని భయం కావొచ్చు.

Venu Swamy, ALLU ARJUN

 

ఇక నుంచి ఎన్టీఆర్ హవా మామూలుగా ఉండదు అట. ఎన్టీఆర్ నిర్మాతలకు బంగారు బాతు అని, మరో ఐదేళ్లూ ఆయన ప్రతి సినిమా పాన్ ఇండియా హిట్టు అవుతుందని చెప్పాడు.

.చైతు జాతకంలో నాగదోషం ఉందట… హిట్‌ కొడతాడు కానీ కొందరి ప్రభావం నుంచి బయటికి రాలేడు అట. అన్నట్టు చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత జాతకం చాలా బాగుందట. సామ్ సినీ కెరీర్ సూపర్ గా ఉంటుందట. ఇలాంటి సోది కబుర్లు ఈ వేణు స్వామి చాలా చెప్పాడు.

Also Read:Balakrishna- Ravi Teja: అదే నిజమైంది.. బాలయ్యతో రవితేజ.. కలయిక ఖరారు

Tags