నితిన్, రష్మిక జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘భీష్మ’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది, మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చలో, భీష్మ రెండు సినిమాలు హిట్ కావడంతో వెంకీ కుడుముల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.
వెంకీ కుడుముల త్వరలో రామ్ చరణ్ తో ఓ చిత్రం చేస్తున్నాడని సమాచారం. రామ్ చరణ్ కు వెంకీ ఓ కథ చెప్పాడనీ, ఆ కథ చరణ్ కు నచ్చడంతో వెంకీ కి ఓకే చెప్పాడంట. ప్రస్తుతం వెంకీ కుడుముల పూర్తి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్నా ఈ సినిమా పై భారి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంక తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాతో బిజీగా ఉన్నాడు.