Venky Kudumula : నితిన్(Hero Nithin), శ్రీలీల(Srileela) జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రం(Robin Hood Movie) మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత నితిన్ నుండి రాబోతున్న సినిమా ఇది. తనతో గతంలో ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ ని తీసిన వెంకీ కుడుముల(Venky Kudumula) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లోనే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. భీష్మ మూవీ ట్రైలర్ కి కూడా అలాంటి రెస్పాన్స్ వచ్చింది కానీ, సినిమా మాత్రం ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించి సర్ప్రైజ్ చేసింది. ‘రాబిన్ హుడ్’ చిత్రం కూడా అలా చేస్తుందేమో అని నితిన్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Also Read : డేవిడ్ వార్నర్ ని అడ్డమైన బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!
ఇకపోతే ఈ చిత్రం లో ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) ఒక కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ చివర్లో ఆయన షాట్ బాగా హైలైట్ అయ్యింది. ట్రైలర్ కింద కామెంట్స్ చూస్తే మొత్తం వార్నర్ మాత్రమే కనిపిస్తాడు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వార్నర్ కూడా ఒక అతిథిగా విచ్చేశాడు. IPL మ్యాచులు ఆడేందుకు హైదరాబాద్ కి వచ్చిన డేవిడ్ వార్నర్ ని సినిమా ప్రొమోషన్స్ కోసం పట్టుకొచ్చేసారు మూవీ టీం. అయితే డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ ని ఉద్దేశించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడిన మాటలు కాస్త నితిన్, శ్రీలీల ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగానే అనిపిస్తాది కానీ, ఆయన మాట్లాడింది వాస్తవాలే.
ఇంతకీ ఆయన ఏమన్నాడంటే ‘ రాబిన్ హుడ్ చిత్రానికి నేడు ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణాలు రెండే రెండు. ఒకటి డేవిడ్ వార్నర్ కాగా, మరొకటి అదిదా సర్ప్రైజ్ సాంగ్. ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర కోసం అంతర్జాతీయ స్థాయిలో ఫేమ్ ఉన్న వ్యక్తి కావాలి అని మా నిర్మాతలను అడిగాను. వాళ్ళు వార్నర్ గారితో మాట్లాడి ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన ఉండడం వల్ల మా సినిమా రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇదంతా బానే ఉంది కానీ, హీరో పేరు కూడా చెప్పి ఉండుంటే బాగుండేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. వార్నర్ వల్ల క్రేజ్ ఏర్పడింది నిజమే అయితే ఈ పాటికి అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉండాలి. కానీ అలా లేదు, నితిన్ గత చిత్రాలతో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ చాలా తక్కువగా ఉంది.
Also Read : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ గ్లింప్స్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!