Venkatesh Son: వెంకటేష్ లాంటి స్టార్ హీరో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈయన చేసిన సినిమాలు ఒకప్పుడు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఫ్యామిలీ స్టార్ గా ఒక ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా శోభన్ బాబు తర్వాత అంతటి ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోగా వెంకటేష్ నిలిచారనే చెప్పాలి.
ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. అలాగే మంచి స్టోరీలు దొరికితే మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటించడానికి తను ఎప్పుడూ ఉత్సాహన్ని చూపిస్తూ ఉంటాడు.
ఇక ఇదిలా ఉంటే అందరి కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ రామ్ నాథ్ దగ్గుబాటి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఎప్పుడు అనేది ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తిని అయితే కల్గిస్తుంది. ఇక వెంకటేష్ మాత్రం తన కొడుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరంగా పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. మరి తను సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. వెంకటేష్ మాత్రం తన కొడుకు కి సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటికి తెలియకుండ జాగ్రత్త పడుతున్నాడు. ఇక తన అభిమానులతో గానీ, ప్రేక్షకులతో గానీ పంచుకోవడం లేదు. మరి ఆయనకి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే తన కొడుకు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే మాత్రం దాదాపు ఇంకో మూడు, నాలుగు సంవత్సరాల్లో అర్జున్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి వెంకటేష్ కొడుకు, పవన్ కళ్యాణ్ కొడుకు, మహేష్ బాబు కొడుకు ముగ్గురిలో ఎవరు స్టార్ హీరోగా నిలుస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి వీళ్ళు ముగ్గురిలో ముందుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఎవరు ఇస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…