‘నారప్ప’గా వెంకటేశ్ బీభత్సమేనట?

విక్టరీ వెంకటేశ్ ఇప్పటిదాకా కామెడీకి కేరాఫ్ అడ్రస్. వెంకీ చేసే సమయానుకూల కామెడీ అంటే ప్రేక్షకులు పడి చస్తారు. ‘ఎఫ్2’ సినిమాతో మరోసారి వెంకీ తన మార్క్ కామెడీని పండించి నవ్వులు పూయించాడు. వెంకటేష్ ఇన్నేళ్ల టాలీవుడ్ కెరీర్ లో రకరకాల పాత్రలు పోషించారు. వివిధ సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. అయితే తాజాగా తెరకెక్కుతున్న ‘నారప్ప’ మూవీలో వెంకటేశ్ బీభత్సం సృష్టిస్తారట.. రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ‘నారప్ప’లో అతను రైతుగా.. ఇరవై సంవత్సరాల కుమారుడిగా […]

Written By: NARESH, Updated On : June 16, 2021 11:29 am
Follow us on

విక్టరీ వెంకటేశ్ ఇప్పటిదాకా కామెడీకి కేరాఫ్ అడ్రస్. వెంకీ చేసే సమయానుకూల కామెడీ అంటే ప్రేక్షకులు పడి చస్తారు. ‘ఎఫ్2’ సినిమాతో మరోసారి వెంకీ తన మార్క్ కామెడీని పండించి నవ్వులు పూయించాడు. వెంకటేష్ ఇన్నేళ్ల టాలీవుడ్ కెరీర్ లో రకరకాల పాత్రలు పోషించారు. వివిధ సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు.

అయితే తాజాగా తెరకెక్కుతున్న ‘నారప్ప’ మూవీలో వెంకటేశ్ బీభత్సం సృష్టిస్తారట.. రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ‘నారప్ప’లో అతను రైతుగా.. ఇరవై సంవత్సరాల కుమారుడిగా తండ్రిగా డబుల్ రోల్ పాత్రల్లో కనిపించనున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నారప్పగా వెంకటేష్ ఇరగదీశాడని అంటున్నారు. వెంకీ తన అసాధారణమైన నటనతో డబుల్ పాత్రల్లో ఒక దాంతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడట..

ప్రతి ఒక్కరూ రిమేక్ చిత్రాలను పోల్చి చూస్తే మొదటి చిత్రమే బాగుందంటారు. కానీ తమిళ వెర్షన్ ను మించి ఈ రీమేక్‌ లో వెంకటేశ్ నటనకు ప్రశంసలు పొందడం ఖాయమంటున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ అత్యుత్తమ ప్రదర్శనతో ఇరగదీసినట్లు తెలిసింది.

వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్ , డిక్షన్ ‘నారప్ప’ లాంటి తీవ్రమైన పాత్రతో సంపూర్ణ విశ్వరూపం చూపాడని చెబుతున్నారు.. ఈ చిత్రం పోస్టర్లలో వెంకటేష్ పూర్తి మేక్ఓవర్ ఇప్పటికే సంచలనమైంది. చిత్రం కూడా అదే రేంజ్ లో ఉంటుందంటున్నారు. కలైపులి ఎస్ తను సహకారంతో సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి నటించింది.