https://oktelugu.com/

F3 Movie First Full Review: ఎఫ్ 3 మూవీ – హిట్టా ? ఫట్టా ?

F3 Movie First Full Review: డబ్బు వల్ల వచ్చే అనర్థాలను ఫన్నీగా చూపిస్తూ రూపుదిద్దుకున్న సినిమా ‘ఎఫ్‌-3’. ఎఫ్ 2కి.. మూడింతలు వినోదంతో వస్తున్నాం అంటూ ప్రమోట్ అయిన ‘ఎఫ్ 3’ ఫైనల్ గా రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు నవ్వించగలిగిందో రివ్యూ చూసి తెలుసుకుందాం ! కథ : లోకంలో పంచ‌భూతాలతో పాటు మరో భూతం ఉంది.. అదే డ‌బ్బు అనే కోణంలో ఈ కథ మొదలైంది. వెంకీ(వెంకటేష్), వ‌రుణ్ (వ‌రుణ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 26, 2022 / 06:05 PM IST

    F3 Movie First Full Review

    Follow us on

    F3 Movie First Full Review: డబ్బు వల్ల వచ్చే అనర్థాలను ఫన్నీగా చూపిస్తూ రూపుదిద్దుకున్న సినిమా ‘ఎఫ్‌-3’. ఎఫ్ 2కి.. మూడింతలు వినోదంతో వస్తున్నాం అంటూ ప్రమోట్ అయిన ‘ఎఫ్ 3’ ఫైనల్ గా రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు నవ్వించగలిగిందో రివ్యూ చూసి తెలుసుకుందాం !

    venkatesh, varun tej

    కథ :

    లోకంలో పంచ‌భూతాలతో పాటు మరో భూతం ఉంది.. అదే డ‌బ్బు అనే కోణంలో ఈ కథ మొదలైంది. వెంకీ(వెంకటేష్), వ‌రుణ్ (వ‌రుణ్ తేజ్) .. డ‌బ్బు, బంగారం అంటే ఆశ ప‌డే భార్య‌ల‌కు భ‌ర్త‌లుగా కనిపించారు. బాగా డబ్బు సంపాదించడానికి నానా పాట్లు పడే వీరికి, లోపాలు కూడా ఉంటాయి. వెంకీకి రేచీక‌టి ఉంటే, వ‌రుణ్ కి న‌త్తి ఉంటుంది. మరి తమ లోపాలను కవర్ చేస్తూ.. డబ్బు సంపాదన కోసం వీళ్లు ఏమి చేశారు ? ఈ ప్రాసెస్ లో తమన్నా, మెహరీన్ వీరికి ఎలాంటి సమస్యలు సృష్టించారు ? ఈ మధ్యలో సునీల్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు ఏమిటి ? చివరకు వెంకీ – వరుణ్ ఏమి సాధించారు ? అనేది మిగిలిన కథ.

    Also Read: Pooja Hegde: బికినీ అందాలు.. ఘాటు ఫోజులు.. బుట్ట బొమ్మ కుమ్మేసింది

    విశ్లేషణ :

    అనిల్ రావిపూడి తన డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అండ్ క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాడు. అలాగే క్వాలిటీ ఫన్ తో ఫుల్ గా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాల్లో వచ్చే సీన్స్ లో అయితే, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశాడు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెంకీ -వరుణ్ ల లోపాలను కూడా చాలా ఫన్నీగా ఎలివేట్ చేశాడు. హీరోలు కూడా, ముఖ్యంగా వెంకటేష్ ‘వెంకీ పాత్ర’లో లీనం అయిపోయాడు. తన మార్క్ బాడీ లాంగ్వేజ్ తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాకే హైలైట్ గా నిలిచాడు.

    వరుణ్ తేజ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి రైటింగ్ టేబుల్‌ దగ్గరే స్క్రిప్ట్ ను బ‌లంగా రాసుకున్నాడు. అదే స్థాయిలో సినిమాని తెర‌పైకి తీసుకొచ్చాడు. డబ్బు కోసం ఇద్దరు ఫ్యామిలీ మ్యాన్స్ పడే ఇబ్బందుల ప‌రిణామ క్ర‌మాన్ని కూడా చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలో పాత్ర‌లు, వాటి ప‌రిచ‌యం, కొన్ని కీలక సన్నివేశాలు స‌ర‌దాగా సాగుతూ.. జోష్ పెంచాయి.

    venkatesh, varun tej

    కాకపోతే.. ద్వితీయార్థంలో క‌థ నెమ్మ‌దిస్తుంది. కామెడీ సినిమా కాబట్టి.. అనిల్ కూడా స్క్రీన్ ప్లేలో చాలా చోట్ల లాజిక్స్ వదిలేశాడు. దాంతో ఈ సినిమా కామెడీ సినిమాగానే మిగిలిపోయింది. నిజానికి కొన్ని సీన్స్ లో ఎమోష‌న్స్ పండినా… ప్ర‌తీ పాత్ర‌కూ జస్ట్ జ‌స్టిఫికేష‌న్ ఇవ్వటానికి తప్ప ఇంట్రెస్ట్ కలిగించలేదు. హీరోయిన్లు తమన్నా, మెహరీన్, పోలీస్ గా రాజేంద్రప్రసాద్, కోటీశ్వ‌రుడిగా ముర‌ళీశ‌ర్మ, ఫ్రెండ్ గా సునీల్ తమ పాత్రల్లో జీవించారు.

    తీర్పు :

    దర్శకుడు అనిల్ రావిపూడి తన కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ.. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాడు. కాకపోతే, వెంకటేష్ తన కామెడీ టైమింగ్ సినిమా స్థాయిని పెంచాడు. అలాగే మిగిలిన భారీ తారాగణం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తమ్మీద ఈ చిత్రం నవ్వులు పూయించింది. కామెడీ సినిమాలు ఇష్టపడేవారికి, ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది.

    సాంకేతిక విభాగం ;

    దర్శకత్వం : అనిల్‌ రావిపూడి

    నిర్మాత : దిల్ రాజు

    సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

    సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

    స్క్రీన్ ప్లే : అనిల్‌ రావిపూడి

    ఎడిటర్ : తమ్మిరాజు

    నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, తమన్నా, మెహరీన్, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్ తదితరులు.

    Also Read:NTR- Srinidhi Shetty: ఎన్టీఆర్ సినిమాలో కేజీఎఫ్ స్టార్.. సెట్ ఐతే రికార్డ్సే

    Recommended Video:

    Tags