F3 Collections: ‘ఎఫ్ 3’ 4 రోజుల కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

F3 Collections: ‘F3’ సినిమాకి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మరి, వరల్డ్ వైడ్ గా నాలుగు రోజులకు గానూ కలెక్షన్స్ ఎంత వచ్చాయి ?. నిన్న సోమవారం నాడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 5.40 కోట్లు రాబట్టింది. వర్కింగ్ డే నాడు ఈ రేంజ్ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం విశేషమే. అయితే, ‘ఎఫ్ 2’కి రూ. 80 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అదే గ్రాస్ పరంగా అయితే 130 కోట్లు […]

Written By: Shiva, Updated On : May 31, 2022 4:30 pm
Follow us on

F3 Collections: ‘F3’ సినిమాకి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మరి, వరల్డ్ వైడ్ గా నాలుగు రోజులకు గానూ కలెక్షన్స్ ఎంత వచ్చాయి ?. నిన్న సోమవారం నాడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 5.40 కోట్లు రాబట్టింది. వర్కింగ్ డే నాడు ఈ రేంజ్ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం విశేషమే. అయితే, ‘ఎఫ్ 2’కి రూ. 80 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అదే గ్రాస్ పరంగా అయితే 130 కోట్లు వచ్చాయి. మరి ‘ఎఫ్ 3’కి ఆ స్థాయి కలెక్షన్స్ వస్తాయా ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

F3 Collections

బడ్జెట్ మాత్రం ‘ఎఫ్ 2’ కంటే.. ‘ఎఫ్ 3’కి డబుల్ అయ్యింది. ఈ లెక్కన ‘ఎఫ్ 3’ రెట్టింపు కలెక్షన్స్ రాబట్టాలి. ఆ పరిస్థితి అయితే, ప్రస్తుతం కనిపించడం లేదు. మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 34.25 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మూడు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 54.90 కోట్లను కొల్లగొట్టింది. మరి నాలుగు రోజుల కలెక్షన్ల పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం.

Also Read: Rajendra prasad- Anchor Manjusha: నటుడు సీరియస్.. అలిగి వెళ్లిపోయిన యాంకర్ మంజూష

నైజాం : రూ. 14.24 కోట్లు

సీడెడ్ : రూ. 4.27 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 4.04 కోట్లు

ఈస్ట్: రూ. 2.22 కోట్లు

వెస్ట్: రూ.1.73 కోట్లు

గుంటూరు: 2.34 కోట్లు

కృష్ణా : 2.05 కోట్లు

నెల్లూరు:1.33 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని నాలుగు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 32.23 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 51.65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 2.02 కోట్లు

ఓవర్సీస్ :రూ. 5.70 కోట్లు

F3 Collections

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 39.95 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 66.70 కోట్లను కొల్లగొట్టింది

అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ 64.50 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. నాలుగు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 39.95 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. ఇంకా మరో రూ.24.55 కోట్లు షేర్ ను రాబట్టాలి. లాంగ్ రన్ లో ఈ సినిమా ఆ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి, ఈ సినిమా సూపర్ హిట్ అయినట్టే.

Also Read:Pawan Kalyan Apologizes To Prabhas: ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా..?

Recommended Videos


Tags