Venkatesh-Trivikram combo : విక్టరీ వెంకటేష్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి కానుక గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ విజయాన్ని సాధించింది. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఆయన మంచి కథను ఎంచుకొని సినిమాలు చేయాలని ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తుంది… ప్రస్తుతం ఆయనకు 300 కోట్ల మార్కెట్ అయితే ఉంది. మరి ఆ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకి సీక్వెల్ గా ఒక మూవీని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఉన్నారట. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనేది తెలియాల్సిందే. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ ప్రతి ఒక్కరు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : 24 గంటల్లో ‘హిట్ 3’ ట్రైలర్ భీభత్సం..అన్ని రికార్డ్స్ స్మాష్!
ఇక మొత్తానికైతే వెంకటేష్ లాంటి స్టార్ హీరో చేస్తున్న ప్రతి సినిమా ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. మరి ఆయన చేసినటువంటి నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి ఇప్పటికీ సీక్వెల్ వస్తుందంటే మాత్రం ప్రతి ఒక్క అభిమాని సైతం ఆ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ సైతం సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇక్కడి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో విక్టరీ వెంకటేష్ అన్నట్టుగా తెలుస్తోంది… వెంకటేష్ లాంటి నటుడు అన్ని రకాల పాత్రలను పోషిస్తాడు.
అయినప్పటికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి మాత్రం డిఫరెంట్ పాత్రలను పోషించడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో అంటే చాలా అంచనాలైతే ఉంటాయి…ఇక వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందనేది వాస్తవం…
Also Read : పెద్ది తో రామ్ చరణ్ పుష్ప రాజ్ ను డీ కొడతాడా.?