Peddi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ (Ram Charan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ సెపరేట్ గా ఒక ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొదట్లో కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగిన రామ్ చరణ్ ఆ తర్వాత కాలం నుంచి చాలా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అందుకే ఆయనకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారాబోతున్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఇక గత సంవత్సరం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో వచ్చి 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేశాడు. మరి ఇలాంటి సందర్భంలో పెద్ది సినిమాతో రామ్ చరణ్ సైతం పుష్పరాజ్ క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
ఇక వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకుంటే మాత్రం వాళ్ళు రామ్ చరణ్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా ఎదుగుతాడు. లేకపోతే మాత్రం కొంతవరకు వెనకబడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలందరీ మధ్య నెంబర్ వన్ ఎవరు అనే విషయంలో తీవ్రమైన పోటీ అయితే నెలకొంది.
ఇక ఈ పోటీలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు భారీ స్థాయిలో ముందుకు దూసుకెళ్తుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వారు కొంతవరకు వెనుక బడ్డారు. మరి వాళ్ళ స్టామినా ఏంటో చూపించి భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తే తప్ప వాళ్ళకంటూ సపరేట్ గా ఒక భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవ్వదు.
Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?