https://oktelugu.com/

Venkatesh ‘Saindhav’ : ‘బ్లాక్ మ్యాజిక్’ నేపథ్యంలో వెంకటేష్ ‘సైంధవ్’.. గూస్ బంప్స్ రప్పిస్తున్న స్టోరీ!

హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో వెంకటేష్ కి జోడిగా ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రద్ద శ్రీనాథ్ నటిస్తుండగా, ప్రముఖ స్టార్ హీరోయిన్ యాండ్రియా జరేమియా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2023 / 02:05 PM IST
    Follow us on

    Venkatesh ‘Saindhav’ : కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి తన ఇంటి పేరునే విక్టరీ గా మార్చుకున్న విక్టర్ వెంకటేష్ , గత కొంతకాలం నుండి సోలో హీరో సినిమాలకంటే కూడా ఎక్కువగా మల్టీస్టార్ర్ర్ సినిమాలే చేస్తూ వచ్చాడు. ఆయన సోలో గా చేసిన ‘నారప్ప’ మరియు దృశ్యం 2 వంటి చిత్రాలు నేరుగా ఓటీటీ లోనే విడుదల అయ్యాయి.

    దీనితో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో నుండి సోలో మూవీ ఎదురు చూస్తున్న నేపథ్యం లో వెంకటేష్ తన 75 వ చిత్రంగా ‘సైంధవ్’ అనే క్రేజీ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు. హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో వెంకటేష్ కి జోడిగా ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రద్ద శ్రీనాథ్ నటిస్తుండగా, ప్రముఖ స్టార్ హీరోయిన్ యాండ్రియా జరేమియా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.

    అంతే కాకుండా ప్రముఖ తమిళ హీరో ఆర్య కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.అయితే ఈ సినిమాని కర్ణాటక లో జరిగిన బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక లో ఇలాంటివి చాలా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. వీటిని అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం ‘బ్లాక్ మ్యాజిక్ యాక్ట్’ ని ప్రవేశ పెట్టింది. రోజు ఈ యాక్ట్ మీద వందల కొద్దీ కేసులు నమోదు అవుతూనే ఉంటాయి, అక్కడ చేతబడి అనేది అంత కామన్ అయిపోయింది అన్నమాట.

    అలా బ్లాక్ మ్యాజిక్ కి గురైన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎలా పగ తన పగని తీర్చుకున్నాడు అనేదే స్టోరీ. డైరెక్టర్ శైలేష్ ఈ చిత్రాన్ని వెంకటేష్ కెరీర్ లోనే ఒక మెమొరబుల్ చిత్రం గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది.