Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అతని సినిమాలకు అభిమానులుగా మారిపోయారు. తన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు థియేటర్లు మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోయేవి… అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించిన ఘనత కూడా తనకే దక్కింది. ఒకప్పుడు శోభన్ బాబు తన సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించేవాడు.ఆ తర్వాత అంతటి గొప్ప రేంజ్ ను అందుకున్న హీరో కూడా వెంకటేష్ కావడం విశేషం… ఇక ప్రస్తుతం వెంకటేష్ సినిమాలు చేస్తూనే మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా ‘మన శంకరా వరప్రసాద్’ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించి ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించాడు… ఇక అలాంటి వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కృష్ణవంశీ డైరెక్షన్లో ఒక ఫ్యామిలీ సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు. నిన్నే పెళ్ళాడుతా సినిమా తర్వాత కృష్ణ వంశీ వెంకటేష్ తో ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు…
నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషించారు. అప్పటివరకు నాగార్జున లో అలాంటి ఒక నటుడు ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు. అంతటి గొప్ప మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ ని నాగార్జున నుంచి రాబట్టిన ఘనత కూడా కృష్ణవంశీ కి దక్కుతుంది.
ఇక అలాంటి దర్శకుడితో వెంకటేష్ ఎందుకు సినిమా మిస్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే అప్పట్లో వెంకీ కోసం చాలామంది దర్శకులు వేచి చూసేవాళ్లు… అప్పటికే వరుసగా నాలుగు సినిమాలకు కమిట్ అయిన వెంకటేష్ కృష్ణవంశీ తో సినిమా చేయడానికి డేట్స్ లేక ఇబ్బంది పడ్డాడట. మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా మిస్ అయింది. కాబట్టి కృష్ణవంశీ సింధూరం లాంటి సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు…
ఆ తర్వాత నాగార్జునతో చంద్రలేఖ, సౌందర్య తో అంతఃపురం లాంటి వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగాడు… మరోసారి వీళ్ళ కాంబినేషన్ అయితే సెట్ అవ్వలేదు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం కృష్ణవంశీ అవుట్ డేటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. అతని నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించడం లేదు. వెంకటేష్ మాత్రం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…