Alluda Majaka: ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ముందుంటారు వెంకటేష్. ఈ హీరో సినిమా వస్తుందంటే కుటుంబంతో సహా ఎలాంటి సందేహం లేకుండా థియేటర్లకు వెళ్లవచ్చు అనుకుంటారు. అయితే ఈ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. సంక్రాంతి బరిలో హీరో వెంకీ సినిమా రాబోతుంది. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈయన నటించిన సైందవ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్బంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు విక్టరీ వెంకటేష్. దీనిలో భాగంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన షో కి వెళ్లారు.
డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా సైంధవ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు వెంకీ మామ అభిమానులు. అయితే ఈ సినిమాలో కూడా నాన్న సెంటిమెంట్ ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తోంది. తండ్రి కూతుళ్ళ బంధం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ట్రైలర్ తర్వాత వచ్చిన టాక్. అయితే ఈటీవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈటీవీ నిర్వహించిన అల్లుడా మజాకా అనే సంక్రాంతి స్పెషల్ కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకటేష్.
ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్స్ మీనా, కుష్బూలు కూడా పాల్గొని సందడి చేశారు. కమెడియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమ కామెడీ అంత బయటకు తీస్తూ.. ప్రేక్షకులను మెప్పించే పనిలో పడ్డారు. అయితే వెంకటేషన్ మాత్రం కమెడియన్ పై చేయి చేసుకున్నారంటూ ఓ వార్త వినిపిస్తోంది. ఈ వార్త అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఇక వెంకటేష్ సినిమాలో ఏసీపీ రామచంద్ర గెటప్ వేశారు. అయితే లోకల్ గ్యాంగ్ స్టర్ రోల్ ప్లే చేసిన సునామీ సుధాకర్ రింగ రింగ రింగా అంటూ పాట పాడారు.
సుధాకర్ ఈ పాట పాడగానే ఏంట్రా ఇది అని అడిగారు వెంకటేష్. కానీ సుధాకర్ మాత్రం పాట అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో చిర్రెత్తిన వెంకటేష్ చెంప చెల్లుమనిపించారు. అంతే ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక నరేష్ వైపు తిరిగి నిన్ను ఎక్కడ కొట్టాలిరా అంటూ తనదైన స్టైల్ లో కామెడీ చేశారు. అయితే ఇదంత కామెడీలో భాగమే అని టాక్. మొత్తం మీద వెంకటేష్ కొట్టింది కామెడీకి మాత్రమే కానీ సీరియస్ గా కాదు అని తెలియగానే ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకుంటున్నారు.