Venkatesh Kalyan Ram New Movie: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి వెంకటేష్ , కళ్యాణ్ రామ్ మల్టీ స్టార్రర్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. వరుస బ్లాక్ బస్టర్స్ , ఇండస్ట్రీ హిట్ తర్వాత రాబోతున్న అనిల్ రావిపూడి సినిమా కాబట్టి , సాధారణంగానే ఈ చిత్రం పై అంచనాలు స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమా రేంజ్ లోనే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బలమైన స్టోరీ ని రెడీ చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాని దింపేందుకు అన్ని విధాలుగా సన్నాహాలు చేసుకున్నాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి. వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి లతో పాటుగా, హీరోయిన్స్ గా నటించబోతున్న కృతి శెట్టి , కీర్తి సురేష్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఇక సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వంటి వారు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అల్లు అరవింద్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొత్తగా, రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసి , మొదటి సన్నివేశానికి దర్శకత్వం వహించాడు. అయితే అనిల్ రావిపూడి ముహూర్తం షాట్ లోనే తన మార్క్ క్రియేటివిటీ చూపిస్తూ , ఈ సినిమా కాన్సెప్ట్ పై ఒక క్లారిటీ ని ఆడియన్స్ కి ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ షాట్ లో వెంకటేష్ కృతి శెట్టి భుజం పై చెయ్యి వెయ్యగా, కళ్యాణ్ రామ్ కీర్తి సురేష్ భుజం పై చేతులు వేస్తాడు. అనంతరం ఒకరిని ఒకరు చూసి షాక్ కి గురై , కీర్తి సురేష్ వెంకటేష్ వైపు , కృతి శెట్టి కళ్యాణ్ రామ్ వైపు వస్తుంది.
దీన్ని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకరి ప్రేయసి తో మరొకరు ఈ చిత్రం లో ఎదో ఒక కారణం చేత కనెక్షన్ పెట్టుకుంటారని , అలాంటి సందర్భాలు ఎందుకొచ్చాయి?, దీని వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కథాంశంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని పుష్కలంగా ఇచ్చే స్కోప్ ఉన్న కథ ఇది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఇలాంటి బోల్డ్ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్స్ ఉండేవి. మొట్టమొదటిసారి అనిల్ రావిపూడి మన టాలీవుడ్ లోకి అలాంటి కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నాడు. ఇందులో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ బావ బావమరిది లుగా కనిపించబోతున్నారు. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. ‘జనవరి 13 న విడుదల’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు అట. సినిమాని కూడా అదే తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి అనిల్ రావిపూడి ఈ చిత్రం తో తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తారా లేదా అనేది.
#VenkyAnil5 Launched!
“జనవరి 12 విడుదల”#NKRAR2 pic.twitter.com/fwuFBF3Wd2
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 18, 2026
