https://oktelugu.com/

Drushyam 2: కుటుంబం కోసం వెంకటేశ్ చేసిన సాహసమే ‘దృశ్యం2’

Drushyam 2: దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేశాడు వెంకటేశ్. ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. వెంకటేశ్ నటన, ఆ సస్సెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుంది. మలయాళంలో హిట్ అయిన ఈ మూవీ తెలుగులోనూ విజయం సాధించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిందే ‘దృశ్యం2’. ఈసారి కాస్త కథ మార్చి.. కథనం మార్చి.. అదే శవం కోసం వెతికే పోలీసులు.. కుటుంబాన్ని కాపాడుకునే వెంకటేశ్ ను ఆద్యంతం ఉత్కంఠ భరితంగా చూపించారు. నాడు కేబుల్ […]

Written By: , Updated On : November 15, 2021 / 08:35 PM IST
Follow us on

Drushyam 2: దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేశాడు వెంకటేశ్. ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. వెంకటేశ్ నటన, ఆ సస్సెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుంది. మలయాళంలో హిట్ అయిన ఈ మూవీ తెలుగులోనూ విజయం సాధించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిందే ‘దృశ్యం2’. ఈసారి కాస్త కథ మార్చి.. కథనం మార్చి.. అదే శవం కోసం వెతికే పోలీసులు.. కుటుంబాన్ని కాపాడుకునే వెంకటేశ్ ను ఆద్యంతం ఉత్కంఠ భరితంగా చూపించారు.

Drushyam 2 trailer

Drushyam 2 trailer

నాడు కేబుల్ టీవీ నడిపే రాంబాబుగా వెంకటేశ్ నటిస్తే ఈసారి థియేటర్ ఓనర్ గా మారాడు. ఓ సినిమాను తీసే పనిలో ఉండగా.. చనిపోయిన డీఐజీ కొడుకు మర్డర్ కేసును మళ్లీ ఒక పోలీస్ ఆఫీసర్ (సంపత్) ఓపెన్ చేయడం.. వెంకటేశ్ ఫ్యామిలీకి కష్టాలు రావడం ఇలా అంతా సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపించారు.

2014లో విడుదలైన దృశ్యం మూవీకి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం2 కూడా అంతే ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ వేడుక సోమవారం హైదరాబాద్ లో జరిగింది. చనిపోయిన డీఐజీ కొడుకు హత్య కేసులో వెంకటేశ్ కుటుంబం పోలీసులకు దొరికిపోయిందా? రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడన్నది ట్రైలర్ లో అద్భుతంగా సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపించారు.

దృశ్యం2ను థియేటర్లో విడుదల చేయకుండా డైరెక్టుగా నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నారు. మలయాళంలో ‘దృశ్యం2’ను తీసిన దర్శకుడు జీతూ జోసఫ్ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.

వీడియో..

Drushyam 2 - Official Trailer | Venkatesh Daggubati, Meena | New Telugu Movie 2021 | Amazon Original