Venkatesh And Trivikram: ఒకప్పుడు యంగ్ హీరోయిన్స్ సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి భయపడే వారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, తమ ఏజ్ గ్రూప్ కాకపోతే సినిమాలు చేసేవారు కాదు కుర్ర హీరోయిన్స్. ఉదాహరణకు సూపర్ స్టార్ రజినీకాంత్ శివాజీ చిత్రాన్ని తీసుకుందాం. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం ఇలియానా ని సంప్రదించారు. కానీ ఆమె నాకు, రజినీకాంత్ సార్ కి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ మీద సెట్ అవ్వదు అని చెప్పి చాలా సింపుల్ గా రిజెక్ట్ చేసిందట. ఇలా చాలా మంది హీరోయిన్స్ మైండ్ సెట్ అప్పట్లో ఉండేది. కానీ ఇప్పటి యంగ్ హీరోయిన్స్ మైండ్ సెట్ అలా లేదు. కథ లో దమ్ముంటే ఎంత వయసున్న హీరో పక్కన నటించడానికైనా సిద్ధం అవుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అలా వెంకటేష్(Victory Venkatesh), త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు కూడా జరిగింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీనిధి వయస్సు 33 ఏళ్ళు, విక్టరీ వెంకటేష్ వయస్సు 64 ఏళ్ళు. అంటే ఇద్దరి మధ్య దాదాపుగా 30 ఏళ్ళ గ్యాప్ ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారంటే అందుకు కారణం కథ. ఈ సినిమా కథ ఒక మిడిల్ ఏజ్ వయస్సు కి సంబంధించిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది అట. శ్రీనిధి అతనికి భార్య గా నటించబోతుంది. సిద్దు జొన్నలగడ్డ, నాని, యాష్ లాంటి యంగ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి, ఒక్కసారిగా 64 ఏళ్ళ సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుందంటే ఆమె ఆలోచనలు ఎంత పరిణీతి చెందినవో అర్థం చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ కచ్చితంగా క్లిక్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
త్రివిక్రమ్,వెంకటేష్ కాంబినేషన్ లో గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలను ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాము. ఈ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించలేదు, కేవలం కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మాత్రమే అందించాడు. ఇప్పుడు దర్శకత్వం కూడా వహించబోతున్నాడు. ఈ కాంబినేషన్ ని ఎప్పుడైతే ప్రకటించారో, అప్పటి నుండే క్రేజీ బిజినెస్ ఆఫర్స్ ఈ సినిమాకు వస్తున్నాయి. సరైన రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.