Venkatesh: వెంకీ మామకు అభిమానులంటూ ప్రత్యేకంగా లేరు కానీ, ఆయన సినిమాలొస్తే ఎవ్వరైనా థియేటర్‌కు వెళ్లి సందడి చేస్తుంటారు. వెంకీ మామ నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని బలమైన నమ్మకం ఉంది. అయితే, పాతికేళ్ల క్రితం బాలీవు్లోనూ వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ మంచి హిట్ అందుకున్నారు. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన చంటి, యమలీల సినిమాలు అక్కడ అనారి, తక్ దిర్ వాలా టైటిల్లలో రీమేక్ చేశారు. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌కు చాలా గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు పాతికేళ్ల తర్వాత బాలీవుడ్‌వైపు ఎందుకో వెంకీ మామకు మనసు మళ్లినట్లుంది. ఈ క్రమంలోనేన కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటించేందుకు సిద్ధమయాయారు. భాయ్‌జాన్ అనే టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాలో వెంకటేశ్ నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా ఓ సూపర్ హిట్ చిత్రానికి అఫిసియల్కు రీమేక్ అని టాక్. 2014 కోలీవుడ్ సూపర్ హిట్‌గా నిలిచిన వీరమ్‌కు రీమేక్‌గా భాయ్‌జాన్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే సల్మాన్, వెంకీ కలిసి అలరించనున్నారు. తెలుగులో వీరమ్ సినిమాను కాటమరాయుడుగా పవన్ కల్యాణ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే, బాలీవుడ్లో కాస్త కథలో మార్పులు చేశారట. సల్మాన్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తండగా.. సౌత్ నుంచి మరో హీరోయిన్‌కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎఫ్3 సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు వెంకటేశ్. ఇందులో వరుణ్ తేజ్ కూడా కనిపించనున్నారు. అనిల్ రావిపుడి దర్శకత్వంలో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమైంది.