Actor Simbu: సినిమాకి – తాగుడికి అవినాబా సంబంధం ఉందని ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖుల విషయంలో రుజువు అయింది. ఆ కోవకే చెందిన హీరో శింబు. మందు మత్తులో చిత్తు అయి సర్వస్వం కోల్పోయిన నేటి హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు శింబు. ఈజీగా పేరు వచ్చింది, పైగా కెరీర్ మొదట్లోనే మంచి హిట్లు వచ్చాయి. ఇటు తెలుగులోనూ ఫుల్ మార్కెట్ వచ్చింది.

దాంతో అప్పట్లో శింబు అంటే.. స్టార్ అనే స్థాయికి శింబు వెళ్ళాడు. కానీ, ఆ తర్వాత తాగుడు, డ్రగ్స్ కి బానిసగా మారాడు. హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా శింబుకి బ్యాడ్ నేమ్ ను తెచ్చి పెట్టింది. మొత్తమ్మీద శింబు సక్సెస్ ట్రాక్ తప్పి, పర్సనల్ లైఫ్ ను కూడా మిస్ లీడ్ చేసుకుని మొత్తానికి ఫేడ్ అవుట్ అయిన హీరోల లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నాడు.
కరెక్ట్ గా ఆ సమయంలోనే శింబుకి ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. చుట్టూ ఉన్న జనం మాయం అయ్యారు. ఇక బంధువులు, సన్నిహితులు తమ గొప్పతనం కోసం శింబు స్థాయిని తగ్గించడం మొదలుపెట్టారు. సక్సెస్ లేకపోతే మనుషులు ఎలా ఉంటారో శింబుకి బాగా అర్థం అయింది. ఒకప్పుడు ఎప్పుడూ తాగుతూ తూగుతూ ఉండే శింబు.. ఆ వ్యసనాల వల్ల తన కెరీర్ నాశనం అవుతోందని గ్రహించాడు.
Also Read: ఆ విషయంలో ‘ఆలియా’ ముందు ఏ హీరోయినైనా వేస్టే !
అన్నీ మానేశాడు. ఏడాది పాటు కష్టపడి ఫిట్నెస్ సంపాదించుకుని.. స్లిమ్ గా తయారయి.. కసితో మొత్తానికి విజయాన్ని సాధించాడు. ‘మనాడు’ అనే సినిమా రీసెంట్ గా విడుదలైంది. మంచి హిట్ అయింది. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత దక్కిన హిట్ అది. ఇక అంతా సంతోషమే అనుకుంటున్న సమయంలో శింబు సడెన్ గా ఆసుపత్రిలో చేరాడు.
వైరల్ ఫీవర్ వల్లే శింబు ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. కానీ, శింబుకి వేరే హెల్త్ ఇష్యూ ఏదో ఉందని ఓ పుకారు, లేదూ కరోనా సోకిందని సోషల్ మీడియాలో మరో పుకారు వైరల్ అవుతుంది. మరి ఇందులో ఏది నిజమో చూడాలి.