Veera Simha Reddy – Jai Balayya Song : ‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. జై బాలయ్య’ అంటూ సాగే ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని పాట తాజాగా రిలీజ్ అయ్యింది. అసలు సిసలు బాలయ్య మాస్ మస్తీని మనకు రుచిచూపించింది. సాధారణంగా ఇండస్ట్రీలోని అందరూ ముద్దుగా మన నందమూరి బాలకృష్ణను ‘బాలయ్య’అంటూ పిలుచుకుంటారు. ఈ మధ్యన ఏం ఫంక్షన్ లో చూసినా.. బయట కనిపించినా ‘జై బాలయ్య’ అనడం ఒక ఆనవాయితీగా వస్తోంది. బాలయ్యలోని మంచితనానికి గుర్తుంగా ఈ పదం వాడుకలోకి వచ్చింది.
ఇంతవరకూ ఏ సినిమాలోనూ ‘జై బాలయ్య’ అనే సినిమా పేరును కానీ.. పాటను కానీ పెట్టలేదు. కానీ తొలిసారి ‘జైబాలయ్య’ పేరుతో ఏకంగా పాటను రూపొందించారు. బాలయ్య లేటెస్ట్ చిత్రం ‘వీరసింహారెడ్డి’లో దీన్ని పెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగీత దర్శకుడు ‘థమన్’ ఈ సాంగ్ ను అద్భుతంగా రూపొందించారు. తాజాగా ఈ పాటను విడుదల చేశారు. ఇందులో థమన్ సైతం పంచెకట్టే డోలు పట్టి వాయిస్తూ ఉత్సాహంగా నటించడం విశేషం.
వీరసింహారెడ్డి చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ నవంబర్ 25న ఈరోజు విడుదల అయ్యింది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుంచి నిన్ననే బాస్ పార్టీ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ తో దేవిశ్రీ ప్రసాద్ దుమ్ము దులిపాడు. ఇప్పుడు థమన్ వంతు వచ్చింది. వీర సింహారెడ్డి ఫస్ట్ సింగిల్ గా ‘జైబాలయ్య’ పాటతో థమన్ ఊపేశాడు. దేవీశ్రీ పాటకంటే థమన్ ‘జైబాలయ్యనే’ కాస్తా బాగున్నట్టు కనిపిస్తోంది. వారిద్దరి మధ్య ఫస్ట్ రౌండ్ మాత్రమే. విన్నర్ ఎవరో తెలియాలంటే రెండు చిత్రాల టోటల్ సాంగ్స్ విడుదల కావాలి. సినిమాల ఫలితాలు తెలియాలి. ఏది ఏమైనా టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తేల్చుకోవాల్సిన ఒత్తిడి వారిద్దరిపై ఇప్పుడు ఉంది.
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదల అవుతున్నాయి.. పోటీపోటీగా సాగుతున్న ఈ చిత్రాల్లో ఏది హిట్ అవుతుందని వేచిచూడాలి.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ీ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందట. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తారట. ఇక బాలయ్యకి జోడీగా శ్రుతి హాసన్ నటించబోతుంది.