Veerasimhareddy Collections : అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే.. బాలయ్య కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ‘అఖండ’ సినిమా క్లోసింగ్ షేర్ 68 కోట్ల రూపాయిల వరకూ ఉంటుంది..ఇదే బాలయ్య బాబు కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్..కానీ ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కేవలం మొదటి వారం లోనే ‘అఖండ’ క్లోసింగ్ కలెక్షన్స్ ని దాటి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..కానీ సంక్రాంతి సెలవుల్లో వచ్చిన వసూళ్లతో పోలిస్తే వీక్ డేస్ లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు చాలా తక్కువ అనే చెప్పాలి..అయితే ఇప్పటి వరకు ఈ సినిమా వచ్చి 10 రోజులు అయ్యింది..ఈ పది రోజులకు గాను ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాలవారీగా ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 16.20 కోట్లు
సీడెడ్ 15.65 కోట్లు
ఉత్తరాంధ్ర 7.07 కోట్లు
ఈస్ట్ 5.42 కోట్లు
వెస్ట్ 4.02 కోట్లు
నెల్లూరు 2.77 కోట్లు
గుంటూరు 6.15 కోట్లు
కృష్ణ 4.45 కోట్లు
మొత్తం 61.73 కోట్లు
ఓవర్సీస్ 5.60 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.60 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 71.93 కోట్లు
బాలయ్య రేంజ్ కి ఈ వసూళ్లు చాలా ఎక్కువే అయ్యినప్పటికీ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని బయ్యర్స్ లో టెన్షన్ మొదలైంది..వీక్ డేస్ లో కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యినప్పటికీ వీకెండ్ లో పుంజుకుంటుందేమో అని అందరూ ఆశించారు..కానీ వీకెండ్స్ లో కూడా ఎలాంటి గ్రోత్ లేదు..దీనితో ఈ చిత్రం క్లోసింగ్ కి దగ్గరగా వచ్చేసిందని..సోమవారం నుండి ఇక పెద్దగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు..ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 75 కోట్ల రూపాయలకు జరిగింది..ఫుల్ రన్ లో ఇంకో రెండు కోట్లు అయితే కచ్చితంగా రాబట్టగలడు కానీ..బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే సోమవారం వచ్చే వసూళ్లు ని చూసి మాత్రమే చెప్పగలం అంటున్నారు.