Vedantam Satyanarayana Sarma: విశ్వనాథ్ గారి క్లాసిక్ చిత్రాల్లో ‘స్వర్ణ కమలం’ సినిమా ప్రత్యేకమైనది. అయితే.. ఈ సినిమాలో భానుప్రియ తండ్రి పాత్రలో నటించిన నటుడు పేరు గురించి ఈ ప్రపంచానికి తెలియదు.. కానీ ఆ నటుడు నిజంగానే ఒక సీనియర్ కూచిపూడి నాట్యకారుడు. కూచిపూడి నాట్యంలో అగ్రగణ్యుడు అని ఎన్నో అవార్డులు అందుకున్న విఖ్యాత సీనియర్ నాట్యకారులు శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ (Vedantam Satyanarayana Sarma) అట. అయితే, ఆయన పేరు టైటిల్స్ లో అసలు వేయకపోవడం అది కూడా తన చిత్రంలో ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా చూసుకునే విశ్వనాధ్ గారి సినిమాలో ఇలా జరగడం కొంచెం ఆశ్చర్యకరమే.
అయితే, దురదృష్టం ఏమిటంటే, సాక్షాత్తూ దర్శకులు విశ్వనాథ్ (K Viswanath) గారికే ఆయన పేరు గుర్తు లేదట. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదా ? కానీ, ఆయన గురించిన వివరాలు విశ్వనాథ్ గారు ఓ ఇంటర్వ్యూలో తెలియజేస్తూ.. ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు. అయితే నిజజీవితంలో కూడా ఆయన నాట్యాచార్యులే. ఊరు ఏలూరు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా గొప్పది.
సినిమాలో తన కుమార్తె నాట్యకళ పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక ముదిమి వయసులోనూ ఆయన ఓ వేదిక పై నాట్యం చేస్తూ ప్రాణాలు వదిలేస్తాడు. అయితే కాకతాళీయమైన విషయం ఏమిటంటే.. నిజజీవితంలోనూ ఆయన నాట్యం చేస్తూనే వేదిక మీదే మరణించారు అని విశ్వనాథ్ గారు చెప్పుకొచ్చారు. ఇక సినిమా టైటిల్స్ లో నటుల పేర్లు వేసినప్పుడు మనకు తెలియని కొన్ని నటుల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక పేరు ఆయనది అయ్యుండచ్చు.
ఏది ఏమైనా ‘స్వర్ణ కమలం’ చిత్రంలో చాలా కీలకమైన, ఉదాత్తమైన పాత్రలో ఒదిగిపోయి నటించిన ఆయన గురించి ఇప్పటివరకూ సరైన సమాచారం దొరక్కపోవడం మన దురదృష్టం. ‘స్వర్ణకమలం’ సినిమాలో భానుప్రియ తండ్రిగా నటించినవారు ‘వేదాంతం శేషేంద్రశర్మ’ అనే ఒక పేరు ఒక చోట కనిపించింది. కానీ అది నిజం కాదు. అందుకే ఆయన ప్రపంచానికి తెలియని గొప్ప నటుడిగా నిలిచిపోయారు.