VD14 Poster: ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత హీరో అవకాశాలు సంపాదించిన ఆర్టిస్ట్ ఈయన. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, చక్కటి నటన కనబర్చే హీరో గా మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు తెలంగాణ మాండలికం వాడే హీరో ఇండస్ట్రీ సక్సెస్ అవ్వడం కేవలం విజయ్ దేవరకొండ విషయం లోనే జరిగింది. అలాంటి విజయ్ దేవరకొండ ఈమధ్య కాలం లో వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్నాడు. ఆయన చివరి హిట్ చిత్రం ‘టాక్సీవాలా’. ఆ తర్వాత విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషి’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి.
Also Read: పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ కలెక్షన్స్ నిల్..శ్రీ విష్ణు ‘సింగిల్’ పరిస్థితి ఏంటంటే!
అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఆయన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కోసం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా కింగ్డమ్ నుండి ఒక సరికొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది కానీ, వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కానీ నేడు విడుదల చేసిన పోస్టర్ లో కూడా ఈ నెల 30న ఈ చిత్రం విడుదల అవుతున్నట్టు చెప్పుకొచ్చారు నిర్మాతలు. అయితే ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ 14 వ చిత్రం #VD14 పోస్టర్ ని కూడా విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘దేవుళ్ళు అతనికి శక్తినిచ్చారు..యుద్ధం అతనికి లక్ష్యాన్ని ఇచ్చింది’ అనే ట్యాగ్ లైన్ తో కేవలం పోస్టర్ తోనే గూస్ బంప్స్ రప్పించారు మేకర్స్.
ఈ పోస్టర్ ని చూసిన తర్వాత ఇది కదా విజయ్ దేవరకొండ నుండి మేము కోరుకునే సినిమా. ఎంతసేపు లిప్ లాక్ సన్నివేశాలు ఉండే సినిమాలు మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ కి ఇలాంటి సినిమాలు చేసే సత్తా ఉంది, అతను ఇలాంటి జానర్స్ ఎన్నో చెయ్యాలి అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అంతే కాదు నటుడు అంటే యాసలు, అన్ని భాషలు మాట్లాడగలగాలి, కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఎలాంటి పాత్ర లో నటించినా కేవలం తెలంగాణ యాసలోనే మాట్లాడడం ఆడియన్స్ కి నచ్చడం లేదు. ఇది కూడా ఆయన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రెండు చిత్రాల్లో ఆయన ఈ ఒక్క లోపాన్ని సరిచేసుకొని, పాత్రకు తగ్గ యాస మాట్లాడుతాడని ఆశిద్దాం అంటూ పలువురు విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు.