Varun Tej Wedding Fix: ఇటీవల కాలం లో టాలీవుడ్ లో యంగ్ హీరోలందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ తమ బాచిలర్ జీవితానికి గుడ్ బాయ్ చెప్తున్నారు..ఇప్పుడు ఆ జాబితాలోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా చేరబోతున్నాడు..గత కొంత కాలం నుండి ఈయన ఒక ప్రముఖ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని..డేటింగ్ చేస్తున్నాడని..త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆ హీరోయిన్ మరెవరో కాదు,అది లావణ్య త్రిపాఠి గారే..అయితే తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని..ప్రేమ పెళ్లి వంటివి కేవలం పుకార్లు మాత్రమేనని ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్ లో లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది..అప్పటి నుండి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అని ప్రచారమయ్యే వార్తలకు ఫుల్ స్టాప్ పడింది..అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియా లో వార్తలు ప్రచారమవుతున్నాయి..దానికి కారణం ఈ ఏడాది నవంబర్ నెలలో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు రావడమే.

ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది నవంబర్ 6 వ తేదీన వరుణ్ తేజ్ కి పెళ్లి చెయ్యాలని నాగబాబు గారు ఫిక్స్ అయ్యినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..ఇందుకు వరుణ్ తేజ్ కూడా సానుకూలంగా స్పందించాడట..అందుకే ప్రస్తుతం ఆయన ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనట్లేదు..పెళ్లి తర్వాతే ఆయన తన కాల్ షీట్స్ ప్రొడ్యూసర్స్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది..అయితే పెళ్లి కూతురు ఎవరు అనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్ గా మారింది..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడట..మరి ఎవరు ఆ హీరోయిన్..??, గత కొంతకాలం నుండి మెగా ఫామిలీ కుటుంబ సభ్యుల ఫామిలీ ఫంక్షన్స్ లో లావణ్య త్రిపాఠి గారు వరుణ్ తేజ్ తో కలిసి కనిపిస్తున్నారు..ఇంతకు ముందు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యినట్టే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా..లేదా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్..ఈ సస్పెన్స్ కి తెర మరి కొద్దీ రోజుల్లోనే పడబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త.

[…] […]