టాలీవుడ్లోలోని హీరోలంతా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమాల్లో నటిస్తూనే నిర్మాతలుగా మారి రెండుచేతుల సంపాదిస్తున్నారు. కొందరు ప్రత్యక్ష్యంగా, మరికొందరు పరోక్షంగా సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, నాగార్జున, కల్యాణ్ రామ్, నాని నిర్మాతలుగా మారారు. తాజాగా మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వరుణ్ తేజ్ ప్రస్తుతం సినిమాల్లో బీజీగా ఉన్నాడు. తాజాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత తాను చేసే సినిమాలన్నింటి పై వరుణ్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. వీటన్నింటిని వరుణ్ కజిన్ సిద్దు ముద్దా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ఇతర హీరోలతో మూవీలను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
కుర్ర హీరో రాజ్ తరుణ్ తో ఓ మూవీని నిర్మించేందుకు వరుణ్ తేజ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలను సిద్దు ముద్దా బ్యానర్ పైనే నిర్మిస్తారని ప్రచారం జరుగుతుంది. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూడా గతంలో పలు సూపర్ హిట్టు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అదేవిధంగా వరుణ్ తేజ్ సోదరుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొణిదల ప్రొడక్షన్లో మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ-150’, ‘సైరా’ చిత్రాలను నిర్మించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ మూవీని నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.