https://oktelugu.com/

Varun Tej : ఒక్క సక్సెస్ రాగానే మూలాలు మర్చిపోకూడదు..అలాంటి వాళ్ళు చెత్తతో సమానం అంటూ స్టార్ హీరోపై విరుచుకుపడ్డ వరుణ్ తేజ్!

వరుణ్ తేజ్ నేరుగా అల్లు అర్జున్ ని విమర్శించకపోయిన, పరోక్షంగా అతని మీదనే సెటైర్లు వేసినట్టుగా అందరికీ అర్థం అవుతుంది. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అల్లు అర్జున్ అభిమానులు వరుణ్ తేజ్ పై విరుచుకుపడుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియో ని షేర్ చేసి అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసి వెక్కిరిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 08:27 AM IST

    Varun Tej

    Follow us on

    Varun Tej : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన వరుణ్ తేజ్, ఈనెల 14వ తేదీన ‘మట్కా’ అనే పీరియడ్ గ్యాంగ్ స్టార్ మూవీ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ సినిమాలకంటే చాలా బెటర్ గా ఉందని ఈ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న వైజాగ్ లో గ్రాండ్ గా జరిపించారు. ఈ ఈవెంట్ కి వరుణ్ తేజ్ తన సతీమణి లావణ్య త్రిపాఠితో విచ్చేశాడు. ప్రసంగంలో ఆయన లావణ్య గురించి మాట్లాడుతూ ‘మా సినిమా హీరోయిన్ వేరే షూటింగ్ లో ఉండి నేడు రాలేకపోయింది. మా సినిమా హీరోయిన్ రాకపోయిన, నా నిజ జీవితంలోని హీరోయిన్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రతీ విషయంలో అండగా నిలుస్తూ సపోర్టు చేస్తున్నందుకు లవ్ యూ’ అని అంటాడు.

    ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ అల్లు అర్జున్ మీద వేసిన పరోక్షమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. ఆయన మాట్లాడుతూ ‘నా ప్రతీ సినిమా పూర్తి అయ్యినప్పుడు, నాలో ఒక చిన్న భయం ఉంటుంది. కష్టపడి సినిమా చేసాము, ఆడియన్స్ నచ్చుతారా లేదా అని టెన్షన్ తో ఉండేవాడిని. మట్కా సినిమా బాగా వచ్చినప్పటికీ కూడా నాలో ఆ టెన్షన్ ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే రామ్ చరణ్ అన్నయ్య నుండి ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ మొత్తం పోయాయి. రామ్ చరణ్ అన్నయ్య నాకు ధైర్యం చెప్పక్కర్లేదు. కేవలం ఆయన నా పక్కన నిల్చుంటే చాలు, ధైర్యం వచ్చేస్తుంది. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటారు. చాలా మంది నన్ను ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అయినా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పుకుంటున్నారు ఎందుకు అని అడుగుతున్నారు. నాకు జీవితాన్ని ఇచ్చింది వాళ్ళే, వాళ్ళ గురించి చెప్పుకోవడం తప్పేమి ఉంది. నీకు రేపు ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా మూలాలు ఇచ్చిన వారిని మర్చిపోతే, ఎన్ని విజయాలు సాధించిన వృధా’ అంటూ చెప్పుకొచ్చాడు.

    వరుణ్ తేజ్ నేరుగా అల్లు అర్జున్ ని విమర్శించకపోయిన, పరోక్షంగా అతని మీదనే సెటైర్లు వేసినట్టుగా అందరికీ అర్థం అవుతుంది. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అల్లు అర్జున్ అభిమానులు వరుణ్ తేజ్ పై విరుచుకుపడుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియోని షేర్ చేసి అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసి వెక్కిరిస్తున్నారు. పైగా వరుణ్ తేజ్ కూడా తన ప్రసంగంలో నాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణే ముఖ్యం అంటూ మాట్లాడాడు. అల్లు అర్జున్ ని పూర్తిగా తన ప్రసంగంలో దూరం పెట్టాడు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య విబేధాలు ఉన్నాయి అనే విషయం వాస్తవమని.