https://oktelugu.com/

Mega Family : ఇటలీలో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న చిరంజీవి కుటుంబం.. వైరల్ ఫొటోలు…

రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలు ఘనంగా జరపడానికి అందరూ ఇటలీకి రావడం జరిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2023 / 10:45 PM IST
    Follow us on

    Mega Family : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలు అందరూ వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేకతని చాటుకుంటున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ల పెళ్లి వేడుక లో మెగా ఫ్యామిలీ అందరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు చాలా రోజుల నుంచి ప్రేమించుకొని రీసెంట్ నిశ్చితార్థం కూడా చేసుకొని ఇప్పుడు పెళ్లి కి రెడీ అయ్యారు.

    ఇక ఇటలీలో వీళ్ళ పెళ్లి జరగనుండగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ వెళ్ళారు.ఇక అందులో భాగంగానే మెగా ఫ్యామిలీ అంతా అక్కడ సందడి చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ఈ పెళ్లికి పెద్దలుగా రామ్ చరణ్ ,ఉపాసన వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక పెళ్లికి సంబంధించిన పనులు మొత్తాన్ని రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు దగ్గరుండి మరి చూసుకుంటున్నారు.

    అయితే చిరంజీవి నూతన వధూవరులను ఆశీర్వదించడానికి తను చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ ఇటలీ వెళ్లి వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చిరంజీవి వశిష్ట తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన షూటింగ్ పనులు మొదలు పెట్టాల్సిన కార్యక్రమం ఉన్నప్పటికి వరుణ్ తేజ్ పెళ్లి ఉండడంతో ఆ షూటింగ్ ని కొద్దిరోజులు వాయిదా వేసినట్టు గా తెలుస్తుంది.చిరంజీవి ఇప్పుడు చాలా దూకుడు పెంచి చాలా ఫాస్ట్ గా షూటింగ్ లను ఫినిష్ చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం వాల్తరు వీరయ్య , భోళాశంకర్ లాంటి రెండు సినిమాలను రిలీజ్ చేశారు. ఇక మీదట కూడా సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దానికోసమే రీసెంట్ గా ఆయన మోకాలికి గాయం తగిలితే దానికి సంబంధించిన సర్జరీని కూడా చేయించుకొని పూర్తి ఫిట్ గా తయారయ్యారు. వరుణ్ తేజ్ కూడా కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా అనే సినిమా చేస్తున్నాడు. ఇక పెళ్లి తర్వాత ఒక వన్ మంత్ బ్రేక్ తీసుకొని వరుణ్ మళ్లీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా ఈమధ్య ఆయన తెలియజేశాడు.

    ఇక రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలు ఘనంగా జరపడానికి అందరూ ఇటలీకి రావడం జరిగింది. ఇంక చాలా సంవత్సరాల ప్రేమని లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్ ఇద్దరు పెళ్లి గా మార్చుకోబోతున్నందుకు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తాడా, లేదా అనేది ఇప్పటివరకు సస్పెన్స్ గానే నెలకొంది…