https://oktelugu.com/

Ghani Movie 3 Days Collections: 25 కోట్లు పెట్టి తీశారు.. మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా?

Ghani Movie 3 Days Collections: మెగా ఫామిలీ నుండి నాగబాబు గారి తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి విభిన్నమైన కథలతో హిట్టు మీద హిట్టు కొడుతూ నేడు క్రేజీ యువ హీరోలలో ఒక్కరిగా మారిన హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..తొలిప్రేమ , F2 మరియు గడ్డలకొండ గణేష్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న వరుణ్ తేజ్ గీత ఆర్ట్స్ సంస్థ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 11, 2022 / 06:07 PM IST
    Follow us on

    Ghani Movie 3 Days Collections: మెగా ఫామిలీ నుండి నాగబాబు గారి తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి విభిన్నమైన కథలతో హిట్టు మీద హిట్టు కొడుతూ నేడు క్రేజీ యువ హీరోలలో ఒక్కరిగా మారిన హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..తొలిప్రేమ , F2 మరియు గడ్డలకొండ గణేష్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న వరుణ్ తేజ్ గీత ఆర్ట్స్ సంస్థ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం గని..ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది..సరైన కథ మరియు కథనం లేకపోవడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు తీవ్రమైన నిరాశకి గురి అయ్యారు..పాపం వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే కష్టపడ్డాడు..ట్రైలర్ మరియు టీజర్ ని చూసిన ప్రతి ఒక్కరు ఇది కచ్చితంగా హిట్ అవుతుంది అనే అనుకున్నారు..కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా నిరాశపరిచింది..దాదాపుగా 25 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం మూడు రోజులకు ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    Ghani Movie 3 Days Collections

    అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని నిర్మించడానికి దాదాపుగా 40 కోట్ల రూపాయిల బడ్జెట్ అయ్యింది..కానీ వరుణ్ తేజ్ కి అంత మార్కెట్ లేకపోవడం తో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని 25 కోట్ల రూపాయలకు జరిపారు..మొదటి రోజు 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి పర్వాలేదు అని అనిపించింది..కానీ అదే జోరు ని రెండవ రోజు మరియు మూడవ రోజు కొనసాగించడం లో ఈ సినిమా విఫలం అయ్యింది అనే చెప్పాలి..దీనితో ఈ సినిమా మూడు రోజులకు గాను కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది,ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 22 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాల్సి ఉంది..ఇది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి..ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్ కేవలం 4 కోట్ల రూపాయిల లోపే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి..అంటే డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 21 కోట్ల రూపాయిల నష్టం తప్పేలా లేదు అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా చెప్పొచ్చు.

    Also Read: తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళతో సమానం – హీరో యాష్

    థియేట్రికల్ రన్ ఇక దాదాపుగా ముగిసే రేంజ్ లో ఉండడం తో ఈ సినిమాని ముందు అనుకున్న తేదీ కంటే త్వరగా OTT లో విడుదల చేస్తే భారీ మొత్తం మీద డబ్బులు ఇష్టం అనే ఆఫర్ వచ్చిందట..దీనితో ఆ చిత్ర నిర్మాత అల్లు బాబీ వచ్చే వారం లోనే ఈ సినిమాని OTT లో దింపడానికి అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి, ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి F3 అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దాదాపుగా 80 కోట్ల రూపాయిల షేర్ ని ఈ సినిమా వసూలు చేసింది..అంత పెద్ద హిట్ సినిమాకి సీక్వెల్ అవ్వడం తో F3 మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి..మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

    Also Read: బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సౌత్ ఇండియా.. కేజీఎఫ్ హిట్ అయితే ఖతమే!

    Tags