https://oktelugu.com/

KGF 2 Yash: తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళతో సమానం – హీరో యాష్

KGF 2 Yash: 2018 లో విడుదల అయినా కన్నడ చిత్రం KGF పార్ట్ 1 ప్రపాంచవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కన్నడ బాషా తో పాటు తెలుగు, హిందీ ,తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల అయినా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది..తెలుగు లో కేవలం రెండు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత దాదాపుగా 14 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 11, 2022 / 06:01 PM IST
    Follow us on

    KGF 2 Yash: 2018 లో విడుదల అయినా కన్నడ చిత్రం KGF పార్ట్ 1 ప్రపాంచవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కన్నడ బాషా తో పాటు తెలుగు, హిందీ ,తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల అయినా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది..తెలుగు లో కేవలం రెండు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత దాదాపుగా 14 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి మొదటి భాగం దాదాపుగా 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది..దీనితో KGF చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో కనివిని ఎరుగని రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి,ఏప్రిల్ 14 వ తేదీన ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బుకింగ్స్ అన్ని బాషలలో ఓపెన్ అయ్యాయి..ఇక చిత్ర బృందం మొత్తం ఈ సినిమా ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాయి..తెలుగు ప్రొమోషన్స్ లో భాగంగా ఈ సినిమా హీరో యాష్ తెలుగు ప్రేక్షకుల పై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

    Hero Yash

    హీరో యాష్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ప్రోత్సహించడం లో ఎప్పుడు ముందు ఉంటారు..KGF చాప్టర్ 1 సినిమాని అంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను, సినిమాని ఎలా చూడాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు..నేను హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఇక్కడి స్టార్ హీరోల రేంజ్ లో నాకు అభిమానులు స్వాగతం పలికారు..ఇంత అభిమానం ని చూపిస్తున్న మీకు ఏమి ఇచ్చి నేను ఋణం తీర్చుకోగలను..మిమల్ని ఎప్పటికి నిరాశ చెందకుండా అద్భుతమైన సినిమాలు మీకు అందించడం లో నేను నా వంతుగా కృషి చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు KGF హీరో యాష్..ఈ ఈవెంట్ మొత్తం లో మీడియా అడిగిన ప్రశ్నలకు యాష్ తెలుగులోనే సమాధానం ఇవ్వడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది,తెలుగు బాషా ని ఇక్కడి ప్రేక్షకులను ఇంతలా గౌరవించినందుకు సోషల్ మీడియా లో యాష్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది.

    Also Read: బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సౌత్ ఇండియా.. కేజీఎఫ్ హిట్ అయితే ఖతమే!

    ఇక KGF చాప్టర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని బాషలలో కనివిని ఎరుగని రేంజ్ లో ఉన్నాయి అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 60 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది, బాహుబలి మరియు RRR చిత్రాలు కూడా ఈ స్థాయి వసూళ్లను మొదటి రోజు రాబట్టలేకపోయింది..KGF చాప్టర్ 1 హిందీ లో ఫుల్ రన్ కేవలం 40 కోట్ల రూపాయిల నెట్ మాత్రమే వసూలు చేసింది, కానీ KGF ఛాపర్ 2 మాతరం కేవలం మొదటి రోజులోనే 60 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చెయ్యబోతుండడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి, ఇక ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం 1000 కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు KGF సినిమా ఆ స్థాయి వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి.

    Also Read: ‘వరుణ్ తేజ్’ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ !

    Tags