
మెగా ఫామిలీ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ కలిగిఉన్న నటుడు వరుణ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచి మాస్ ఇమేజ్ కన్నా వైవిధ్యానికే అధిక ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు చేస్తున్న నటుడు వరుణ్ తేజ్. ఇంతవరకు చేసిన తొమ్మిది సినిమాల్లోఅయిదు విజయాలు కూడా వున్నాయి. వరుణ్ ఖాతాలో . గత ఏడాది `ఎఫ్ 2`, `గద్దల కొండ గణేష్` వంటి ఘన విజయాలతో ఇపుడు నిర్మాతల హాట్ ఫెవరెట్ అయ్యాడు. సినిమా సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించు కొనే వరుణ్ తేజ్ తన రాబోయే చిత్రం లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు.బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రానికి “బాక్సర్” అనే టైటిల్ ఖరారు చేసారు.
కాగా ఈ బాక్సర్ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ దర్శక , నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు అయిన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం లో మరో హీరోయిన్ కూడా ఉండబోతోంది. కాగా ఆ పాత్రకు అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి ఎన్నికైంది అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ఓలింపిక్ విన్నర్ ` టోని జెఫ్రీస్ ` దగ్గర బాక్సింగ్ లో ప్రత్యేకమైన శిక్షణను తీసుకున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తో పాటు శివగామి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందే సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు