https://oktelugu.com/

Varun tej – Lavanya Tripathi : పెళ్లికి ముందే వరుణ్ తేజ్ తో కలిసి ఆ పనిచేసిన లావణ్య.. ఫొటోలు వైరల్

ఇందులో లావణ్య త్రిపాఠి కూడా ఉండడం విశేషం. వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి ఇంకా కాకముందే నాగబాబు ఇంట్లో జరిగిన గణేశ్ వేడుకలకు హాజరుకావడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2023 / 11:32 AM IST

    varun tej lavanya

    Follow us on

    Varun tej – Lavanya Tripathi : టాలీవుడ్ అవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు కలిసి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వీరి నిశ్చితార్థం జూన్ 9న రాత్రి అతికొద్దిమంది సమక్షంలో జరిగింది. అప్పటికే లవ్లో ఉన్న వీరు ఆడియన్స్ కు షాకింగ్ ఇస్తూ నిశ్చితార్థ వేడుకలు జరుపుకున్నారు. అయితే పెళ్లి నవంబర్ లో జరగనున్నట్లు సమాచారం. పెళ్లి కుదిరిన తరువాత లావణ్య సినిమాల్లో కనిపించడం లేదు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ‘గాంఢీవధారి అర్జున’ అనే సినిమాతో నటిస్తున్నాడు. మరో హిందీ మూవీ కి కమిట్ అయినట్లు సమాచారం. అయితే పెళ్లికి గ్యాప్ బాగా రావడంతో వరుణ్ తేజ్, లావణ్యలు కలిసి తిరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా వీరిద్దరూ ఎక్కడ కలిశారో తెలుసా?

    దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు సినీ సెలబ్రిటీస్ తమ ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని నిలుపుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగా ఫ్యామిలీ ప్రతీ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించి అందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో పెడుతూ ఉంటుంది. తాజాగా నాగబాబు ఫ్యామిలీ తమ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తేజ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశాడు.

    అయితే ఇందులో లావణ్య త్రిపాఠి కూడా ఉండడం విశేషం. వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి ఇంకా కాకముందే నాగబాబు ఇంట్లో జరిగిన గణేశ్ వేడుకలకు హాజరుకావడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సాధారణంగా పెళ్లికాకుండా ఆడపిల్లలు అత్తారింట్లోకి అడుగుపెట్టరు. పెళ్లయిన తరువాత మొదటిసారి అడుగుపెట్టేముందు కొన్ని సంప్రదాయ పద్ధతులు పాటించి మొదటి పాదం మోపుతారు. కానీ నేటి కాలంలో జనరేషన్ మారిపోయింది. ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేవారు ఇప్పుడు అంతా కలిసిపోతున్నారు. ఇందులో భాగంగానే లావణ్య త్రిపాఠి వరున్ తేజ్ ఇంట్లోవాలిపోయింది.

    ఈ సందర్భంగా తమ ఇంట్లో జరిగిన వేడుకలకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తేజ్ నెట్టింట్లో షేర్ చేసి ‘నిహారిక నిన్ని మిస్ అవుతున్నాం’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే నిహారిక ఆప్రికా టూర్ కు వెళ్లినట్లు సమాచారం. ఆమెకు సంబంధించిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఇక వరుణ్ తేజ్, లావణ్యల వివామం నవంబర్ 1న జరిగే అవకాశం ఉంది. కానీ కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ప్రకటించలేదు. అయితే వరణ్, లావణ్యలు కలిసి షాపింగ్ చేస్తున్న కొన్ని ఫొటోలు లీకయ్యాయి. వీరి పెళ్లి ఆడంబరంగా కాకుండా అతికొద్ది మంది సమక్షంలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.