Varun Sandesh: హ్యాపీడేస్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరై.. కుర్రాళ్లు చిత్రంతో తనకంటూ ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో వరుణ్ సందేశ్. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన ఇందువదన. ఇప్పటి వరకు తన కెరీర్లో ఎప్పుడూ నటించని డిఫరెంట్ క్యారెక్టర్లో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాతోనే చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు వరుణ్. మధ్యలో భార్యతో కలిసి బిగ్‌బాస్ సీజన్3లో సందడి చేసిన వరుణ్.. ఆ తర్వాత నుంచి కథలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.
Varun Sandesh
కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి కూడా వెనకాడని ఈ హీరో.. ఇందువదన సినిమాలో హీరోగా దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఈ సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ సరసన ఫర్నాజ్ శెట్టి నటిస్తోంది.
Also Read: నయీం డైరీ సినిమాకు షాక్.. స్టే విధించిన తెలంగాణ హైకోర్టు
ఎమ్మెస్సార్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ సినిమాకు శివ కాకాని సంగీతం అందించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతో వరుణ్ సందేశ్ తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారని.. ఈ చిత్రంలో ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు ఎమ్మెస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఇప్పటికే సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా.. యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తర్వాత తిరిగి ప్రేక్షకులను పలకరించనున్న వరుణ్ ఏ రేంజ్లో హిట్ కొడతాడో తెలియాలంటే.. జనవరి 1వరకు వేచి చూడాల్సిందే.
Also Read: ఆటోలో గమనం సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన శ్రియ
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Varun sandesh induvadana movie releasing on january 1st
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com