Varun Lavanya Marriage: మెగా హీరో వరుణ్ తేజ్ ఒక ఇంటివాడయ్యాడు. ఈ యంగ్ హీరో లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్ళికి ఇటలీ దేశం వేదికైంది. నవంబర్ 1న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వరుణ్-లావణ్యల వివాహానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సతీసమేతంగా పాల్గొన్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ సందడి చేసిన ఈ వేడుక నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.
పెళ్లి అనంతరం హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. వెంకటేష్, నాగ చైతన్య వంటి స్టార్స్ తో పాటు పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పెళ్లి తర్వాత జరగాల్సిన కీలక తంతు వ్ వాయిదా పడినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అదే శోభనం. వరుణ్-లావణ్యలకు శోభనం ఇటలీ దేశంలోనే జరపాలని మొదట అనుకున్నారట. ఇటలీ దేశంలోనే వీరి ప్రేమకు బీజం పడిన నేపథ్యంలో అది బెస్ట్ ప్లేస్ అనుకున్నారట. అయితే రిసెప్షన్ ముగియకుండా ఫస్ట్ నైట్ చేయడం సరికాదని ఆ ఆలోచన విరమించుకున్నారట. 5న రిసెప్షన్ ముగిసిన నేపథ్యంలో పురోహితుడిని సంప్రదించగా ఆయన కొన్నాళ్ళు వాయిదా వేశాడని టాక్. మరి వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.
వరుణ్-లావణ్య మిస్టర్ మూవీలో జంటగా నటించారు. 2017లో విడుదలైన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. మిస్టర్ మూవీ సెట్స్ లో వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఐదేళ్లకు పైగా వరుణ్-లావణ్య ప్రేమించుకుంటున్నారు. తమ రిలేషన్ పై వచ్చిన కథనాలను వారు ఖండించారు. సడన్ గా నిశ్చితార్థం జరుపుకుని పెళ్ళికి రెడీ అయ్యారు.