‘Varsham’ re-release closing collections : ఈ మధ్య కాలంలో బాగా నడుస్తున్న ట్రెండ్ రీ – రిలీజ్..పోకిరి మరియు జల్సా సినిమాలు పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు పుట్టిన రోజుల సందర్భంగా ఫాన్స్ స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా వేసుకున్నారు..ఈ రెండు సినిమాల స్పెషల్ షోస్ కి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి..పోకిరి సినిమాకి కోటి 72 లక్షల రూపాయిల గ్రాస్ రాగా, జల్సా సినిమాకి 3 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ రెండు సినిమాల స్పెషల్ షోస్ ఈ రేంజ్ సక్సెస్ అవ్వడం తో నిర్మాతలు తమ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిన చిత్రాలను 4K వెర్షన్ కి రీ మాస్టర్ చేసి ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసారు..అలా ప్రభాస్ పుట్టిన రోజుకి బిల్లా సినిమా స్పెషల్ షోస్ ని ఏర్పాటు చెయ్యగా పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ కెరీర్ లోని మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ వర్షం సినిమాని రీ మాస్టర్ చేయించి రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసారు.
ఎలాంటి హడావుడి మరియు ప్రొమోషన్స్ లేకుండా విడుదలైన ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి రెస్పాన్స్ వచ్చింది..రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు వారం రోజులకు పైగా ప్రదర్శితమైన ఈ చిత్రానికి 62 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఇదే సినిమాని ప్రభాస్ పుట్టిన రోజు నాడు ప్రదర్శించి ఉంటె కచ్చితంగా జల్సా మూవీ రికార్డుని బద్దలు కొట్టేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చెప్పుకుంటున్నారు..ప్రభాస్ మరియు త్రిష హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా అప్పట్లో 18 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను రాబట్టి 125 కేంద్రాలలో 50 రోజులు మరియు 79 కేంద్రాలలో వంద రోజులు ఆడింది.
గోపీచంద్ ఈ సినిమాలో విలన్ గా నటించగా ప్రముఖ యంగ్ హీరో సంతోష్ శోభన్ తండ్రి శోభన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికి మారుమోగుతూనే ఉంటుంది..అలాంటి క్లాసిక్ చిత్రాన్ని ఎలాంటి హడావుడి లేకుండా రీ రిలీజ్ చేసినా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.