
ఆడవాళ్ళ అసలు స్వరూపం బయట పెట్టడానికి కంకణం కట్టుకున్నారు ఆర్జీవీ. ఏది అనిపిస్తే.. దాని పై సినిమాలు తీయడం నేర్చుకున్న ఆర్జీవీ నుండి విభిన్నమైన కాన్సెప్ట్ లు ఈ మధ్య రావడం లేదు. ఆర్జీవీ కంపెనీ నుండి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్ లు అన్నీ క్రైమ్ చుట్టూ రొటీన్ ప్లే తో సాగుతూ బోర్ కొట్టిస్తున్నాయి.
మరి ఇవన్నీ ఆలోచించుకున్నాడేమో అందుకే, తనకు బాగా ఇష్టమైన ఆడవాళ్ళ పై సిరీస్ తీయడానికి పూనుకున్నాడు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సిరీస్‌లో ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ విషయాన్ని ఆర్జీవీ ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేస్తూ చెప్పుకొచ్చాడు.
ఇంతకీ ఆర్జీవీ చెప్పిన సంగతులు ఏమిటంటే.. ‘ఎంతోమంది మహాకవులు స్త్రీల స్వరూపాన్ని వివిధ రకాలుగా రాశారు. చెప్పారు. కానీ కాలమానంలో ఎన్నో రకాలైన స్త్రీలు ఉద్భవిస్తారనే అసలు విషయాన్ని వాళ్ళు ఊహించలేకపోయారు. గ్రహించలేకపోయారు’ అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఇప్పటి కాలంలో ఉన్న భార్యల గురించి ఫన్నీ వేలో అలాగే తనకు ఇష్టమైన బోల్డ్ గా అందరికీ తెలియజేస్తూ ‘రకరకాల భార్యలు’ అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యని చూపించనున్నట్లు చెప్పుకొచ్చాడు.