Varanasi Vs Spirit: దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునేలా చేశాడు. బాహుబలి సినిమాతో ఎక్కడలేని గుర్తింపును సంపాదించుకున్న ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. రాజమౌళి సైతం ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిని పక్కనపెట్టి ఈ సినిమా కోసం కొత్త పంథాలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి సినిమాలో ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాల్లో ఏ రేంజ్ ఎలివేషన్స్ ను చూపించబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడు. అలాంటి దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ ఇండియా వైడ్ గా భారీ పాపులారిటిని సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది…
పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గొప్ప విజయాన్ని నమోదు చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ తను చేసిన సినిమాలతో పాటు ప్రేక్షకుల్లో ఒక ఇంటెన్స్ డ్రామాను కూడా క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ ఉండబోతుంది ప్రభాస్ స్టామినాను పూర్తిగా వాడుకోబోతున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ప్రస్తుతం వారణాసి స్పిరిట్ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది. ఈ రెండు సినిమాలు 2027 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి వీటిలో ఏ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా మారబోతుంది? ఏ సినిమా అత్యధికంగా కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది అనే దాని మీదనే ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపైతే ఉంది. రెండు సినిమాలు కనక సూపర్ సక్సెస్ లను సాధిస్తే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆపేవారు ఎవరు ఉండరనేది మరోసారి ప్రూవ్ అవుతుంది…