Varanasi to Mahabharata: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను తీస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే వాళ్ళ ఐడెంటిటిని చూపిస్తూ సినిమా స్థాయిని పెంచుతూ వస్తున్నారు. అలాంటి వారిలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు… స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన కెరియర్ని స్టార్ట్ చేసిన ఆయన ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ లేకుండా 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న వారణాసి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక రీసెంట్ గా ‘వారణాసి ‘ అనే టైటిల్ని రిలీజ్ చేసిన ఆయన ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ఇంక దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా కథ మొత్తం రివిల్ అయిపోయింది…
ఇక టైం ట్రావెల్ లో రామాయణం జరుగుతున్న కాలానికి వెళ్లిన (రుద్ర) మహేష్ బాబు అక్కడ రాముడిగా మారి చెడు అంతం చేసి మహాభారతానికి లీడ్ ఇస్తూ సినిమాని ఎండు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఈ సినిమాతో లింకప్ అయి ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని సైతం తన నెక్స్ట్ సినిమాగా చేయబోతున్నాడు.
ఇందులో హీరోలందరిని బాగం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే వారణాసి అనేది త్రేతాయుగంలో స్టార్ట్ అయి ద్వాపర యుగానికి ఒక లీడ్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి ఏది చేసినా కూడా ఒక సంచలనంగా మారుతోంది.
కాబట్టి ఇప్పుడు వారణాసి సినిమా నుంచి తన మహాభారతానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక రాజమౌళి ఏది చేసిన దానికి చాలా క్యాలిక్యూలేషన్స్ ఉంటాయి…ఇక మొత్తానికైతే రాజమౌళి వారణాసి మూవీ తో ఎంత గొప్ప సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం 2027 సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే…